AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Clip: ఇదేం ప్రేమరా బుడతా..! ఆటల పోటీ కోసం.. మరీ ఇంతలా చెయ్యాలా..?

పోటీ ఏమిటంటే.. కళ్లకు గంతలు కట్టుకుని దూరం నుంచి వచ్చి తన తల్లికి బన్ తినిపించడం. ఇంకా ఎవరైతే తన తల్లికి వేగంగా బన్ తినిపిస్తారో వారే..

Funny Clip: ఇదేం ప్రేమరా బుడతా..! ఆటల పోటీ కోసం.. మరీ ఇంతలా చెయ్యాలా..?
Boy Feeding His Mom
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 25, 2023 | 12:40 PM

Share

అమ్మ అంటే ప్రేమ ఉండని పిల్లలెవరు ఉంటారు. ముఖ్యంగా అబ్బాయిలకైతే తల్లే మొదటి ప్రపంచమని చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి ప్రేమ పంచుతూ పెంచిన తల్లిని సంతోషంగా చూసుకోవాలనేది ప్రతి అబ్బాయికి ఉండే కోరిక. అయితే ప్రస్తుతం తన తల్లిపై తనకు ఉన్న ప్రేమను చూపించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు ఓ బుడతడు. ఆ చిన్న పిల్లవాడు చేసిన పనికి నవ్వకుండా ఉండలేరు. విషయం ఏమిటంటే.. అది స్కూల్ పిల్లల ఆటల పోటీ. అందులో పోటీ ఏమిటంటే.. కళ్లకు గంతలు కట్టుకుని దూరం నుంచి వచ్చి తన తల్లికి బన్ తినిపించడం. ఇంకా ఎవరైతే తన తల్లికి వేగంగా బన్ తినిపిస్తారో వారే గెలిచినట్లు.

అయితే పోటీలో పాల్గొన్న ఓ స్కూల్ కిడ్ బన్ తీసుకుని వేగంగా తన తల్లి దగ్గరకు చేరుకున్నాడు. ఎలా అయినా పోటీలో గెలవాలనుకున్న ఆ చిన్నారి.. తన తల్లి నోటిలో ఆ బన్ పెట్టి గట్టిగా లొపలికి నెట్టాడు. ఆ క్రమంలో అది పోకుండా బయటే ఉన్నప్పుడు సుత్తి తీసుకుని కొట్టినట్లు ఆ బన్‌ను తన తల్లి నోటిలోకి నెడుతున్నాడు. ఇలా బన్ తినిపించం పూర్తయిందనుకున్నాక కళ్లకు గంతలు తీసి చూశాడు. గెలిచానన్న ఆనందం ఆ చిన్నారి కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఆ పోటీల సమయంలో అక్కడే నిలబడి ఉన్న పిల్లలు.. ఈ చిన్నారి చేసే పనిని చూసి నవ్వేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట పోస్ట్ కావాడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా, tamil.engineer అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. ఇక మూడు రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు 5 లక్షల 62వేల మంది చూశారు. అలాగే ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 23వేల లైకులు అందాయి. ఈ క్రమంలోనే నెటిజన్లలో ఒకరు ‘తన తల్లిపై తనకు ఎంత ప్రేమ ఉందో ఆ పిల్లవాడు చూపించాలనుకున్నాడ’ని రాసుకొచ్చారు. మరో నెటిజన్ ‘అబ్బాయిలతో వచ్చిన బాధే ఇది. అందుకు అమ్మాయిలే బెస్ట్’ అని అన్నారు. ఇలా వీడియో చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..