AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood: నెట్టింట పాటలు పాడుతూ ఫేమస్.. కట్ చేస్తే.. సోనూ సూద్ సినిమాలో ఛాన్స్..!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఎటువైపు నుంచి అదృష్టం తన్నుకొస్తుందో ఎవరికీ తెలియదు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అమర్‌జీత్ జైకర్‌కు కూడా ఇలానే కలలో కూడా ఊహించని అదృష్టం వచ్చి తలుపు తట్టింది. ఇటుకల బట్టీ కార్మికుడైన అమర్‌జీత్‌కు పాటలు పాడడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే అతను బాలీవుడ్ పాటలను పాడుతూ వాటిని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఉండేవారు. అయితే అతను ఇటీవలి కాలంలో ‘దిల్ దే దియా హై’ పాట పాడి ఆ […]

Bollywood: నెట్టింట పాటలు పాడుతూ ఫేమస్.. కట్ చేస్తే.. సోనూ సూద్ సినిమాలో ఛాన్స్..!
Sonu Sood; Amarjeet
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 25, 2023 | 10:01 AM

Share

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఎటువైపు నుంచి అదృష్టం తన్నుకొస్తుందో ఎవరికీ తెలియదు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అమర్‌జీత్ జైకర్‌కు కూడా ఇలానే కలలో కూడా ఊహించని అదృష్టం వచ్చి తలుపు తట్టింది. ఇటుకల బట్టీ కార్మికుడైన అమర్‌జీత్‌కు పాటలు పాడడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే అతను బాలీవుడ్ పాటలను పాడుతూ వాటిని ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఉండేవారు. అయితే అతను ఇటీవలి కాలంలో ‘దిల్ దే దియా హై’ పాట పాడి ఆ వీడియోను ట్విట్టర్‌లో  పోస్టు చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిని 10 లక్షల మందికిపైగా వీక్షించారు.

అయితే అనుకోకుండా ఈ వీడియోను చూసిన బాలీవుడ్ నటుడు, హెల్పింగ్ స్టార్ సోనూ సూద్, నటి నీతూ చంద్ర, ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ సహా పలువురు ప్రముఖులు అమర్‌జీత్‌ను ప్రశంసిస్తూ వీడియోను రీ ట్వీట్ చేశారు. అంతేకాదు సోనూ సూద్, నీతూచంద్ర అతడి ఫోన్ నంబరు తీసుకుని మరీ మాట్లాడారు. అంతేకాక సోనూసూద్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఫతే’ చిత్రంలో అతడికి పాడే అవకాశాన్ని కూడా కల్పించారు. బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అమర్‌జీత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోనూ సూద్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న అమర్‌జీత్ వారి ప్రేమాభిమానాలు తనకు ఇలాగే ఉండాలని కోరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కాగా, అమర్‌జీత్ పెట్టిన ఈ పోస్ట్‌‌లకు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. అతని గాత్రం చాలా మధురంగా ఉందని, తాను పాడుతున్న పాటలు వాటి ఒరిజినల్ కంటే బాగున్నాయని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఫతే’ సినిమాలో తాను పాడబోయే పాట ద్వారా మరింత ఫేమస్ అవ్వాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. మరోవైపు ఇలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ద్వారా సినిమా పాటల అవకాశం పొందినవారు చాలా తక్కువ మంది ఉన్నారు.

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు