Pooja Vastrakar: ప్రపంచకప్ సెమీస్ ముందు భారత్‌కు భారీ షాక్.. గాయంతో టోర్నీ దూరమైన ఆల్‌రౌండర్ పూజా..

ఫిబ్రవరి 23 సాయంత్ర 6:30 గంటలకు టీ20 వరల్డ్ కప్‌ సెమీస్ మ్యాచ్‌ కోసం ఆసీస్ జట్టుతో భారత్ తలపడనుంది. అయితే ఈ కీలక పోరుకు సిద్ధమవుతోన్న..

Pooja Vastrakar: ప్రపంచకప్ సెమీస్ ముందు భారత్‌కు భారీ షాక్.. గాయంతో టోర్నీ దూరమైన ఆల్‌రౌండర్ పూజా..
ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2023 ‘గ్రూప్‌ బీ’ టాప్ 2 స్థానాలలో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఈ రోజు సెమీ ఫైనల్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 23, 2023 | 5:50 PM

మహిళల టీ20 ప్రపంచకప్‌లో వియజాలతో సెమీస్‌కు చేరిన టీమిండియాకు ఆ మ్యాచ్‌ ఆడే ముందు ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు అంటే ఫిబ్రవరి 23 సాయంత్ర 6:30 గంటలకు టీ20 వరల్డ్ కప్‌ సెమీస్ మ్యాచ్‌ కోసం ఆసీస్ జట్టుతో భారత్ తలపడనుంది. అయితే ఈ కీలక పోరుకు సిద్ధమవుతోన్న తరుణంలో టీమిండియా ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌ నుంచే వైదొలగింది. ఈ మేరకు రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాని ఆమె స్థానంలో తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా చేసింది బీసీసీఐ.

మరోవైపు గ్రూప్‌-B నుంచి రెండోస్థానంలో ఉన్న భారత్‌ సెమీస్‌లోకి అడుగు పెట్టినా.. ఆస్ట్రేలియాపై టీమిండియాకు టీ20 వరల్డ్‌కప్‌లో ఏమంత మెరుగైన రికార్డు‌లు లేవు. దానికి తోడు భారత ఉమెన్స్ టీమ్‌లోని టాప్ ప్లేయర్ ఈ రోజు సెమీస్ మ్యాచ్‌కి దూరమయ్యింది. అయితే ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ ఐదు సార్లు భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడగా.. భారత్ రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం జట్టులో హార్మన్‌ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, రిచా ఘోష్, యస్తికా భాటియా వంటి టాప్‌ ప్లేయర్లు ఉన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం