SRH: 17 ఏళ్లకే క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు ఐపీఎల్ కెప్టెన్సీ అందుకున్నాడు

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్‌రమ్‌కు..

SRH: 17 ఏళ్లకే క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. ఇప్పుడు ఐపీఎల్ కెప్టెన్సీ అందుకున్నాడు
Sunrisers Hyderabad
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 23, 2023 | 5:45 PM

ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతోంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్‌రమ్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ. ఇటీవల SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు మార్క్‌రమ్‌ ప్రాతినిధ్యం వహించాడు. టోర్నమెంట్‌లో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచేందుకు అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా మార్క్‌రమ్ అద్భుతమైన ఆటతీరును కనబరిచాడు. SA20 లీగ్‌ ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మార్క్‌రమ్.. సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో ఫైనల్‌ గెలిచేందుకు కీలక పాత్ర పోషించాడు. అలాగే ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్‌’ అవార్డును గెలుచుకున్నాడు. ఆ ఫామ్‌తో ఇప్పుడు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పగ్గాలు చేపట్టనున్నాడు.

ఇక మార్క్‌రమ్ ఐపీఎల్ రికార్డుల విషయానికొస్తే.. ఇప్పటివరకు అతడు 18 ఇన్నింగ్స్‌ల్లో 40.54 సగటుతో 527 పరుగులు చేశాడు. అలాగే గత సీజన్‌లో, మార్క్‌రమ్‌ 12 ఇన్నింగ్స్‌లలో 47 కంటే ఎక్కువ సగటుతో 381 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్ లాంటి క్రికెటర్లు ఉన్నప్పటికీ.. ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్‌రమ్‌పైనే నమ్మకం ఉంచింది హైదరాబాద్ ఫ్రాంచైజీ. SA20 లీగ్ ప్రారంభ టోర్నీలో సన్‌‌రైజర్స్‌కి ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించిన మార్క్‌రమ్.. అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా అదే ఆటతీరును ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తాడని ఫ్రాంచైజీ భావిస్తోంది.

  • 17 ఏళ్లకే క్రికెట్‌కు స్వస్తి పలకాలనుకున్నాడు..

2012వ సంవత్సరంలో ఈ ఆటగాడు క్రికెట్ నుంచి తప్పుకోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో మార్క్‌రమ్ వయస్సు 17 సంవత్సరాలు. వాస్తవానికి, అతడు 2012లో నార్తర్న్ గౌటెంగ్ జట్టులో ఎంపిక కావాల్సి ఉంది.. అయితే అది జరగకపోవడంతో.. నిరాశ నిస్పృహలకు లోనైన మార్క్‌రమ్ ఆటకు ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ స్నేహితులు, సన్నిహితుల సలహా మేరకు మళ్లీ 2014లో క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు. ప్రపంచకప్‌లో ఆ జట్టును విజేతగా నిలిపాడు.

  • అటు బ్యాట్.. ఇటు బంతితోనూ..

మార్క్‌రమ్ బ్యాట్‌తోనే కాకుండా బంతితో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఆటగాడు పార్ట్‌టైం ఆఫ్ స్పిన్నర్. ఇటీవల SA20 లీగ్‌లో, అతడు 366 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు కూడా పడగొట్టాడు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే