AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dinesh Karthik: కేఎల్ రాహుల్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకే.. మాజీల తరహాలోనే.. కానీ..!

రాహుల్‌ మంచి ప్లేయరే అయినప్పటికీ గత కొన్ని రోజులుగా అతడు గాడి తప్పాడని డీకే అన్నాడు. ఒకవేళ అతడిని రానున్న మ్యాచ్‌లకు తొలగిస్తే దానికి కారణాలు కూడా..

Dinesh Karthik: కేఎల్ రాహుల్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకే.. మాజీల తరహాలోనే.. కానీ..!
Dinesh Karthik On Kl Rahul
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 23, 2023 | 12:46 PM

Share

ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమిండియా సీనియర్ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌‌పై.. అటు మాజీల నుంచి, ఇటు క్రికెట్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పేలవ ప్రదర్శన కారణంగా అతన్ని జట్టు నుంచి తొలగించాలని పలువురు మాజీలు కూడా సూచిస్తున్నారు. అదే నేపథ్యంలో టీమిండియా ఆటగాడు దినేష్ కార్తీక్ కూడా కేఎల్ రాహుల్ విషయంలో స్పందించాడు. డీకే కూడా రాహుల్ విషయంలో మాజీల మాదిరిగానే తన అభిప్రాయాన్ని తెలిపినా.. అతని పరిస్థితిపై విచారం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో డీకే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని, ఒకానొక సందర్భంలో బాధ తట్టుకోలేక వాష్‌రూంకు వెళ్లి మరీ కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తుచేసుకున్నాడు.

‘ఇది ప్రొఫెషనల్‌ ప్రపంచం. ఇందులో కొన్ని కొన్ని సార్లు మనం బాధాకరమైన క్షణాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి దశను నేను కూడా అనుభవించాను. ఇది మన చివరి ఇన్నింగ్స్‌ కావొచ్చేమోనన్న విషయం మనకు అర్థమైతే అది ఇంకా బాధాకరం. నాకూ అలానే జరిగింది. ఆ సమయంలో నేను డ్రెస్సింగ్‌ రూంలోకి తిరిగొచ్చాక మౌనంగా వాష్‌రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా. అలాంటి పరిస్థితి చాలా విచారకరం’ అంటూ కేఎల్ రాహుల్‌ ఫామ్‌ గురించి ప్రస్తావిస్తూ దినేష్ కార్తీక్ మాట్లాడాడు. ఇంకా రాహుల్‌ మంచి ప్లేయరే అయినప్పటికీ గత కొన్ని రోజులుగా అతడు గాడి తప్పాడని డీకే అన్నాడు. ఒకవేళ అతడిని రానున్న మ్యాచ్‌లకు తొలగిస్తే దానికి కారణాలు కూడా కేఎల్‌కు స్పష్టంగా తెలుసన్నాడు. అందువల్ల రాహుల్‌ కొంతకాలం విరామం తీసుకోవాలని, తిరిగి పుంజుకుని జట్టులోకి తిరిగి రావాలని డీకే సూచించాడు.

కాగా, గత కొంతకాలంగా ఫామ్ లేక అటకెక్కిన ఆటతీరుతో ఇబ్బంది పడుతున్న రాహుల్.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలోని తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ చేతులేత్తేశాడు. ఈ కారణంగానే అతడిని జట్టు నుంచి తొలగించాలని అటు మాజీల నుంచి, క్రీడాభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో మిగతా రెండు టెస్టులకు రాహుల్‌ను ఎంపిక చేసినప్పటికీ.. అతడిని జట్టు వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించింది సెలెక్షన్ కమిటీ. ఇక తుది జట్టులో అతడిని తీసుకుంటారా లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే భారత్, ఆసీస్ జట్ల మధ్య మార్చి 1 నుంచి ఇండోర్‌ వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం