- Telugu News Photo Gallery Cricket photos IPL 2023 CSK hunting for the replacement player for kyle Jamieson here are the 2 options for Chennai team
CSK-IPL 2023: కొత్త ఆటగాడి కోసం అన్వేషణలో పడిన ‘చెన్నై’.. సీఎస్‌కేకు ఆ ముగ్గురే చాయిస్..?
IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ ఒక విదేశీ(ఓవర్సీస్) ఆటగాడిని ఎంచుకోవలసి ఉన్నందున తనకు అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపికల కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు ఉన్న చాయిస్‌లో ముగ్గురు విదేశీ బౌలర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వారెవరంటే..?
Updated on: Feb 23, 2023 | 3:04 PM

ఐపీఎల్ 2023 సీజన్ 16 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అయితే అంతకంటే ముందు సీఎస్‌కే జట్టు తన కొత్త ప్లేయర్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.

అవును ఐపీఎల్ మినీ వేలం 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ గాయం కారణంగా ఈ ఏడాది జరిగే లీగ్‌కు దూరమయ్యాడు. ఈ మేరకు రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌ని ఎంచుకోవడానికి CSK జట్టు సిద్ధంగా ఉంది.

కైల్ జేమీసన్ ఓవర్సీస్ ప్లేయర్ కావడంతో.. విదేశీ పేసర్‌ను ఎంచుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉత్తమ ఎంపికల కోసం గాలిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు ఉన్న చాయిస్‌లో ముగ్గురు విదేశీ బౌలర్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఆండ్రూ టై: ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ టై డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్. అతను ఇంతకు ముందు ఐపీఎల్‌లో కనిపించలేదు. ఇక ఇటీవల జరిగిన మినీ వేలంలో కూడా అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మరోవైపు ఇటీవల ముగిసిన బిగ్ బాష్ లీగ్‌లో 16 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టి రాణించాడు. ఐపీఎల్‌లో కూడా 30 మ్యాచ్‌లాడి 42 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో CSK ఫ్రాంచైజీ జామిసన్‌కు బదులుగా టైని ఎంచుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

జెరాల్డ్ కోట్సీ: దక్షిణాఫ్రికాకు చెందిన 22 ఏళ్ల గెరాల్డ్ కోట్సీ కూడా CSK జట్టు ఎంపిక జాబితాలో ఉన్నాడు. ఎందుకంటే దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో CSK ఫ్రాంచైజీ జోబర్గ్ సూపర్ కింగ్స్ తరఫున గెరాల్డ్ ఆడాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ తరఫున అతను 9 మ్యాచ్‌లలో మొత్తం 17 వికెట్లు తీశాడు. అందుకే జేమీసన్ స్థానంలో గెరాల్డ్‌ను ఎంపిక చేసే అవకాశాలను తోసిపుచ్చలేం.

రిలే మెరెడిత్: ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ రిలే మెరెడిత్ పేరు కూడా వినిపిస్తోంది. 140 kmph వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న మెరెడిత్ IPL 2022లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం 8 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేసుకునే విషయానికి వస్తే, CSK రిలే మెరెడిత్‌ను ఎంచుకోగలదు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్), భగత్ వర్మ, అజయ్ మండల్, నిశాంత్ సింధు, షేక్ రషీద్, బెన్ స్టోక్స్, అజింక్యా రహానే, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివం దూబే, రాజవర్ధన్ దూబే, రాజవర్ధన్ దూబే డ్వేన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, , సిమర్‌జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేష్ తీక్షన్.




