- Telugu News Photo Gallery Cricket photos England player ben stokes missed ipl 2023 end days for csk team due to ireland test and ashes series
IPL 2023: చెన్నై ఫ్యాన్స్‌కు షాకివ్వనున్న రూ.16.25 కోట్ల ప్లేయర్.. ఐపీఎల్ 2023 మధ్యలోనే జంప్.. ధోని సేనకు భారీ దెబ్బే..
వెటరన్ ఆల్ రౌండర్, ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, రెండేళ్ల తర్వాత ఐపీఎల్‌కి తిరిగి వచ్చాడు. జూన్ 1 నుంచి ఐర్లాండ్‌తో టెస్టులో ఆడనున్నాడు.
Updated on: Feb 23, 2023 | 5:44 AM

ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ఇంకా ఒక నెల కంటే ఎక్కువ సమయం లేదు. కానీ ఇప్పటి నుంచే ఐపీఎల్‌కు సంబంధించిన వార్తలతో అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, కొన్ని వార్తలు అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తుంటే.. మరికొన్ని మాత్రం షాక్ అందిస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ న్యూస్ మాత్రం.. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కి టెన్షన్ పెరగడం ప్రారంభమైంది. ఎందుకంటే ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సీజన్ మధ్యలో జట్టును విడిచిపెట్టనున్నాడు.

బీబీసీ నివేదిక ప్రకారం, జూన్ ప్రారంభంలో ఐర్లాండ్‌తో జరిగే వన్-ఆఫ్ టెస్ట్ మ్యాచ్‌కు, ఆపై యాషెస్ సిరీస్‌కు సిద్ధమయ్యేలా ఐపీఎల్ చివరి రోజుల్లో సీఎస్‌కేకు ఇంగ్లీష్ కెప్టెన్ అందుబాటులో ఉండడు.

మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ మే 28 వరకు కొనసాగుతుంది. అయితే ఈ సమయానికి స్టోక్స్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించి తన దేశానికి తిరిగి వెళ్లనున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్‌లో ఆడుతున్న స్టోక్స్, ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు సన్నద్ధమయ్యేందుకు తనకు తగినంత సమయం ఇవ్వాలని కోరుతున్నానని చెప్పుకొచ్చాడు.

జూన్ 1 నుంచి లార్డ్స్‌లో ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జూన్ 16 నుంచి ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది.

ఒకవేళ చెన్నై జట్టు ప్లేఆఫ్ లేదా ఫైనల్స్‌కు చేరుకుంటే.. స్టోక్స్‌ను మధ్యలో వదిలేయడం సీఎస్‌కేకి ఇబ్బందిగా మారవచ్చు. ఇంగ్లండ్ కెప్టెన్ రెండేళ్ల తర్వాత ఐపీఎల్‌కి తిరిగి వస్తున్నాడు. ఈసారి వేలంలో రూ.16.25 కోట్ల భారీ మొత్తానికి సీఎస్‌కే కొనుగోలు చేసింది.





























