AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: వారికి క్షమాపణలు చెప్పిన వైఎస్ షర్మిల.. ఎందుకంటే..?

ట్రాన్స్‌జెండర్ల పట్ల తనకు, తన పార్టీకి ఎనలేని గౌరవం ఉందని, క్షణికావేశంలో ఆ మాట అన్నానని, అయితే వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని..

YS Sharmila: వారికి క్షమాపణలు చెప్పిన వైఎస్ షర్మిల.. ఎందుకంటే..?
YS Sharmila
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 22, 2023 | 8:43 PM

Share

వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్లకు క్షమాపణ తెలిపారు. అయితే ఇటీవల మహాబూబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను అనరాని మాటలతో వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించగా.. ఈ వ్యాఖ్యలపై ట్రాన్స్‌జెండర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌జెండర్లపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ట్రాన్స్‌జెండర్ల మనోభవాలు దెబ్బతినే పదాలను వాడటం ఎంత వరకు సమంజసమని ఆందోళనలు చేపట్టి.. షర్మిల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదే పదే ఆ పదాన్ని వాడుతూ తమ ఆత్మ గౌరవం దెబ్బ తీస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక నుంచి ఇలాంటి పదాలు వాడి తిడితే.. రాష్ట్రంలో రాజకీయ నాయకులను తిరగనివ్వమని ట్రాన్స్‌జెండర్లు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల స్పందించారు. ట్రాన్స్‌జెండర్ల పట్ల తనకు, తన పార్టీకి ఎనలేని గౌరవం ఉందని, క్షణికావేశంలో ఆ మాట అన్నానని, అయితే వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, వారిపై తనకెప్పుడూ గౌరవమే ఉందని షర్మిల స్పష్టం చేశారు. కేవలం ఒక ఎమ్మెల్యే తనను అవమానిస్తే.. తిప్పికొట్టే ప్రయత్నం చేశానని వివరణ ఇచ్చానని షర్మిల అన్నారు. ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో విలువ ఉందని చెప్పానని.. వారు సమాజంలో గొప్పగా బతుకుతున్నారని చెప్పానని అన్నారు. ట్రాన్స్‌జెండర్ అక్క చెల్లెలకు మనసు నొప్పించి ఉంటే.. బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని ఆమె తెలిపారు. వారికి తాను ఎల్లప్పుడు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన యూత్ కాంగ్రెస్ వరంగల్ అధ్యక్షుడు పవన్‌ను పరామర్శించిన వైఎస్ షర్మిల అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ క్రమంలోనే ఆమె ‘తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి. గవర్నర్‌ను కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతాం. తెలంగాణలో రౌడీల రాజ్యం నడుస్తుంది. పోలీసులు బీఆర్ఎస్‌కు ఫ్రెండ్లీ పోలీసులు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీద దాడులు చేస్తారా..? తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేదు. పవన్ కోలుకోవడానికి అరు నెలలు పడుతుందని వైద్యులు చెప్పారు. ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను అనరాని మాటలతో షర్మిల విమర్శించడంతో అధికార పార్టీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. షర్మిలపై కేసు నమోదుచేసి పోలీసులు తమ అదుపులోకి తీసుకొని బలవంతంగా హైదరాబాద్‌కు తరలించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాత్రమే తాను స్పందించానని, శంకర్ నాయక్ తనను టాన్స్‌జెండర్ అని పిలిచాడని, తాను కేవలం ‘ఎవరు టాన్స్‌జెండర్’ అని సమాధానమిచ్చానన్నారు షర్మిల.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..