- Telugu News Photo Gallery Business photos Second hand bike available for you in Online best 3 bikes under Rs 40000 check here for full details
Second Hand Bikes: సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా..? రూ.40 వేలలోపు లభించే బెస్ట్ వెహికిల్స్ ఇవే..
సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ప్రస్తుతం మూడు బైకులు రూ.40 వేల కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. కండీషన్, మైలేజీ రేంజ్ మంచిగా ఉన్న ఆ బైకులను మీరు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మరి వాటి వివరాలేమిటో మనం ఇప్పుడు చూద్దాం..
Updated on: Feb 22, 2023 | 6:47 PM

భారతదేశంలో కార్ల కంటే బైకులకే పెద్ద మార్కెట్ ఉంది. దేశంలో ప్రతి నెలా లక్షల బైక్‌లు అమ్ముడవుతుంటాయి. స్టూడెంట్స్ నుంచి ఉద్యోగం చేసేవారి వరకు అందరికీ బైకు ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది కార్ల కంటే బైకులే తమ ఎంపిక అంటుంటారు.

అయితే ప్రస్తుత కాలంలో బైకుల ధర రూ.లక్షలకు చేరింది. ఫలితంగా బైకు కొనడం కూడా ఖర్చుతో కూడుకున్నదిగా మారిపోయింది. ఈ కారణంగానే చాలా మంది తమ అవసరాలకు తగినట్లుగా సెకండ్ హ్యాండ్ బైకులనే కొనుగోలు చేయాలనుకుంటున్నారు.

మరి అలాంటి వారికోసమే ప్రస్తుత మార్కెట్‌లో కొన్ని సెకండ్ హ్యాండ్ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు రూ.40,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 20న ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ ‘ఓఎల్ఎక్స్’ వెబ్‌సైట్‌లో రూ.40,000 కంటే తక్కువ ధరకు బైక్‌లు ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న వీటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Hero glamour 2017: ఇప్పటివరకు 23 వేల కిలోమీటర్లు తిరిగిన 2017 మోడల్ హీరో గ్లామర్ బైక్.. ప్రస్తుతం ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి ఉంది. ఈ బైక్ ధర రూ.34 వేలు. ఈ బైక్ ఒక లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని దాని యాజమాని తెలిపారు. ఈ బైక్ చూడ్డానికి చాలా బాగుంది. బైక్‌పై ఒక్క గీత కూడా లేదు. టైర్లు చాలా బాగా ఉన్నాయి.

Yamaha FZS: ఇప్పటివరకు 29 వేల కిలోమీటర్లు తిరిగిన 2016 మోడల్ యమహా ఎఫ్‌జెడ్‌ఎస్ బైక్ ఓఎల్ఎక్స్‌లో ఉంది. ఈ బైక్ కోసం మీరు రూ.38 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది ఢిల్లీలోని తిలక్ నగర్లో అమ్మకానికి ఉంది. ఈ బైక్ రంగు బ్లూ అండ్ వైట్. బైక్ కండిషన్ బాగానే ఉంది. బైక్ నంబర్ DL 8Sతో స్టార్ట్ అవుతుంది.

Bajaj Pulsar 180: ఇప్పటివరకు 19 వేల కిలోమీటర్ల రీడింగ్ ఉన్న 2016 మోడల్ బజాజ్ పల్సర్ బైక్ ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి ఉంది. ఈ బైక్ ధర రూ.45 వేలు. ఇది ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో అమ్మకానికి ఉంది. ఈ బైక్ మంచి కండీషన్‌లో ఉందని, ఫైనాన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.





























