- Telugu News Photo Gallery Business photos New Hyundai Verna exterior design revealed; launch on March 21
New Hyundai Verna: హ్యుందాయ్ నుంచి సరికొత్త కారు.. అద్భుతమైన డిజైన్!
మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకుని అత్యాధునిక ఫీచర్స్‌తో కార్లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక దక్షిణ కొరియా కార్ బ్రాండ్ హ్యుందాయ్ కొత్త ‘వెర్నా’ సెడాన్ విడుదలకు సిద్ధమైంది..
Updated on: Feb 21, 2023 | 9:10 PM

మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదలవుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకుని అత్యాధునిక ఫీచర్స్‌తో కార్లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక దక్షిణ కొరియా కార్ బ్రాండ్ హ్యుందాయ్ కొత్త ‘వెర్నా’ సెడాన్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 21న భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే కంపెనీ ఈ సెడాన్ కోసం రూ. 25 వేలతో బుకింగ్స్ ప్రారభించింది. అయితే ఇప్పుడు వచ్చే మోడల్ గత మోడల్ కంటే కాస్తా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

హ్యుందాయ్ వెర్నా సెడాన్ కొత్త డిజైన్‌తో రోడ్డెక్కనుంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్, ఫ్లాట్‌గా ఉండే బోనెట్, డోర్స్ మీద క్యారెక్టర్ లైన్స్, స్టైలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉంటాయి.

హ్యుందాయ్ వెర్నా 1.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రూపొందించింది కంపెనీ. దీనిలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లేదు. ఈ కారు ధర బుధవారం విడుదల సమయంలో వెల్లడించనుంది కంపెనీ.

ఇక ఫీచర్స్ విషయానికొస్తే ఈ వాహనంలో డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే, బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్‌తో ఏడీఏఎస్ టెక్నాలజీ ఉంది. అలాగే ఈ కారులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు కూడా ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ దీని సొంతం.

ఇది చూసేందుకు తాజాగా వచ్చిన హ్యుందాయ్ ఎలంట్రా, గ్రాండియర్ సెడాన్ మాదిరిగానే కనిపిస్తుంది. డుదలైన తరువాత స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.





























