Cockroaches: బొద్దింకలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..! వెంటనే పారిపోతాయి..

ఎన్నిసార్లు తరిమికొట్టినా తిరిగి వస్తూనే ఉంటాయి ఈ బొద్దింకలు. చాలామంది వీటిని పూర్తిగా తొలగించలేక వాటి మానాన..

Cockroaches: బొద్దింకలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..! వెంటనే పారిపోతాయి..
Cockroaches
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 22, 2023 | 9:05 PM

మన ఇంట్లో అత్యంత ముఖ్య భాగమైన వంట గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. లేదంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వ్యాప్తి చెందుతాయి. సాధారణంగా వంటగదిలో అందరు ఎదుర్కొనే సమస్య బొద్దింకలు. ఎన్నిసార్లు తరిమికొట్టినా తిరిగి వస్తూనే ఉంటాయి ఈ బొద్దింకలు. చాలామంది వీటిని పూర్తిగా తొలగించలేక వాటి మానాన వాటిని వదిలేస్తారు. అయితే మీరు కూడా ఈ బొద్దింకల సమస్యతో బాధపడుతున్నట్లయితే కొన్ని రకాల హోం రెమెడీస్‌ని పాటిస్తే చాలు. మరి అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

లవంగాలు, వేప నూనె మిశ్రమం: లవంగాల ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. అందువల్ల లవంగాలు ఉంటే మీ వంటగది నుంచి బొద్దింకలు పారిపోతాయి. దీని కోసం సుమారు 20 నుంచి 25 లవంగాలు మెత్తగా చేసి ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల వేపనూనె కలిపి బొద్దింకలు దాక్కున్న ప్రదేశాల్లో స్ప్రే చేయాలి. బొద్దింకలు లవంగం, వేప వాసనను భరించలేవు. దీంతో వెంటనే అవి పారిపోతాయి. తరచుగా ఈ స్ప్రేని చల్లుతూ ఉండాలి. దీంతో ఇవి కిచెన్‌లోకి అడగుపెట్టలేవు.

కిరోసిన్ ఆయిల్: ఈ రోజుల్లో కిరోసిన్ చాలా నగరాల్లో అందుబాటులో లేదు. కానీ కొద్దిగా కిరోసిన్‌ సంపాదించి బొద్దింకలు ఎక్కడ ఉంటే అక్కడ కిరోసిన్ ఆయిల్ పిచికారీ చేయండి. ఇది గొప్ప మందులా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

పుదీనా నూనె, ఉప్పు: ఇంటి నుంచి బొద్దింకలను వదిలించుకోవడానికి మరొక ప్రభావవంతమైన మార్గం ఇది. అందుకోసం పుదీనా నూనెలో ఉప్పు, నీరు కలపండి. బొద్దింకలు ఉన్న ప్రదేశాలలో స్ప్రే చేయండి. వెంటనే అవి పారిపోతాయి.

బేకింగ్ సోడా: బొద్దింకలను వదిలించడానికి బేకింగ్ సోడాలో కొంచెం పంచదార కలపండి. బొద్దింకలు ఉన్న చోట ఉంచండి. బేకింగ్ సోడా, చక్కెరను నీటిలో కలిపి కూడా చల్లుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బొద్దింకలన్నీ తేలికగా పారిపోతాయి.

పగుళ్లను పూరించడం: ఇంట్లో ఉండే పగుళ్లు కీటకాలకు నిలయంగా మారుతాయి. ఈ పరిస్థితిలో ఫ్లోర్, కిచెన్ సింక్‌లో ఉన్న పగుళ్లను వైట్ సిమెంట్ సహాయంతో పూరించండి. బొద్దింకలు ఈ పగుళ్లలో దాక్కుని గుడ్లు పెడతాయి. పగుళ్లు మూసుకుపోయినప్పుడు బొద్దింకలకు చోటు దొరకదు. అవి వాటంతటవే తగ్గుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!