Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రానున్న 3 నెలలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ.. పూర్తి వివరాలివే..

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) రానున్న మూడు నెలలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత..

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రానున్న 3 నెలలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ.. పూర్తి వివరాలివే..
Tirumala Tirupati
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 22, 2023 | 4:18 PM

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) రానున్న మూడు నెలలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అన్‌లైన్ కోటాను ఈ రోజు(ఫిబ్రవరి 22) సాయంత్ర 4 గంటలకు రిలీజ్ చేసింది. అంటే.. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు కూడా ఉన్నట్టు టీటీడీ తెలిపింది. దాంతో పాటు ఈ మూడు నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ.. ఈ రోజు ఉదయం 10గంటల నుంచి ప్రారంభమయింది. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 24 ఉదయం 10గంటల వరకు ఉంటుంది. ఈ లక్కీ డిప్‌లో టికెట్లు పొందినవారు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలని సూచించింది. భక్తులందరూ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ వెల్లడించింది.

ఎలా బుక్‌ చేసుకోవాలంటే..?

ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం స్పెషల్‌ ఎంట్రీ దర్శన్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి జనరేట్‌ ఓటీపీపై క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీని ఎంటర్ చేస్తే… టికెట్ బుక్‌ చేసుకోవడానికి వివిధ తేదీలతో కూడిన స్లాట్స్‌ ఓపెన్‌ అవుతాయి. మీకు నచ్చిన తేదీని సెలక్ట్ చేసుకొని ఆన్‌లైన్‌లో మనీ పేమెంట్ చేస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్