Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నీ తెలివికి జోహార్లు సామీ..! ఎలుగుబంటి నుంచి తృటిలో తప్పించుకున్న వ్యక్తి.. అతను ఏం చేశాడంటే..?

మీకు గుర్తుందా..? అడవిలో ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులు ఎలుగుబంటి నుంచి తప్పించుకున్న కథ. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో కూడా..

Watch Video: నీ తెలివికి జోహార్లు సామీ..! ఎలుగుబంటి నుంచి తృటిలో తప్పించుకున్న వ్యక్తి.. అతను ఏం చేశాడంటే..?
Man Climbing Tree To Escape From Bear Attack
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 22, 2023 | 4:28 PM

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది చిన్నాపెద్దా తేడా లేకుండా అలా హల్‌చల్ చేస్తున్న వీడియోలను చూస్తూ కాలం గడిపేస్తున్నారు.  ఈ  వీడియోలను చూస్తూ.. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులకు సంబదించిన వీడియోస్ చక్కర్లు కొడుతుంటాయి. అయితే మీకు గుర్తుందా..? అడవిలో ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితులు ఎలుగుబంటి నుంచి తప్పించుకున్న కథ. ఆ కథలో ఒక వ్యక్తి చెట్టు ఎక్కితే.. మరో వ్యక్తి చనిపోయిన శవంలా పడిపోయి దాని నుంచి తప్పించుకుంటాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఒక వ్యక్తి చెట్టు ఎక్కి తనపై దాడికి యత్నిస్తున్న ఎలుగు బంటి నుంచి తృటిలో తప్పించుకున్నాడు.

‘animals_powers’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మనం చూస్తున్న దృశ్యాల ప్రకారం అడవి ద్వారా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి బ్యాగ్ వేసుకుని వెళుతుండగా.. ఓ భారీ ఎలుగుబంటిన చూసి భయపడిపోతాడు. ఆ వ్యక్తిని ఎలుగుబంటి కూడా చూసి అతని దగ్గరికి వస్తుంది. తప్పించుకోవడానికి వీలులేని సమయంలో ఆ వ్యక్తి పక్కనే ఉన్న చెట్టు ఎక్కాలని ఆ ప్రయత్నం చేస్తాడు. ఇది గమనించిన ఎలుగుబంటి అతన్ని అందుకునేందుకు చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి తొందరతొందరగా చెట్టు ఎక్కుతున్నా.. అతడి కాలును అందుకుంటుంది. అయితే ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి పూర్తిగా చెట్టు ఎక్కేస్తాడు. ఎలుగుబంటి మాత్రం కిందే ఉండిపోతుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా, ‘ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి’ అనే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదా సరగాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘వీడియో షూట్ చేస్తున్న కెమెరామెన్‌పై ఎలుగుబంటి ఎందుకు దాడి చేయలేదని’ రాసుకొచ్చాడు. మరో నెటిజన్ అయితే ‘ఈ సంఘటనను చూసి కెమెరామ్యాన్ నవ్వేసుకుంటున్నాడు’ అని కామెంట్ చేశాడు. ఇంకో నెటిజన్ ‘నీ తెలివికి, సమయస్ఫూర్తికి జోహార్లు బ్రో’ అని అన్నాడు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాక ఈ వీడియోపై లైకుల వర్షం కురుస్తోంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 57వేల వీక్షణలు రాగా, దాదాపు 8 వేల లైకులు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..