AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gannavaram: టీడీపీ నేత పట్టాభి సహా మరో 15 మందికి 14 రోజుల రిమాండ్.. కోర్టు ఏం చెప్పిందంటే..?

కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తతలకు సంబంధించి టీడీపీ నేత పట్టాభి సహా 15 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. గన్నవరంలో సోమవారం..

Gannavaram: టీడీపీ నేత పట్టాభి సహా మరో 15 మందికి 14 రోజుల రిమాండ్.. కోర్టు ఏం చెప్పిందంటే..?
Pattabhiram
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 21, 2023 | 9:42 PM

Share

టీడీపీ ఆఫీస్‌పై వంశీ అనుచరుల దాడి ఘటనతో గన్నవరంలో హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది.! ఇటు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సోమవారం దాడి జరిగిన సమయంలో అక్కడ తాను లేనని.. ఉంటే అక్కడితో ఆగేది కాదని అన్నారు వల్లభనేని వంశీ. వంశీ తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సవాళ్లు-ప్రతిసవాళ్లతో హైవోల్టేజ్ హీట్‌ నెలకొంది. ఈ క్రమంలోనే నిన్న పోలీసులు ఆరెస్ట్ చేసిన టీడీపీ నేత పట్టాభిరామ్‌కు.. మంగళవారం విచారణ జరిపిన స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆయనతో పాటు మరో 10 మంది టీడీపీ నేతలకు కూడా ఇదే రకమైన తీర్పునిచ్చింది కోర్టు. అయితే పట్టాభికి చికిత్స అందించాలని టీడీపీ నేతల కోరడంతో.. చికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి ఆయనను తరలించారు అధికారులు. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. పట్టాభిరామ్ ఇంటికి చేరుకుని ఆయన భార్య చందనను ధైర్యం చెప్పారు.

నిన్న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నేడు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. పట్టాభి, తదితరులపై గన్నవరం సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. పట్టాభి, తదితరులు ప్రాణహాని కలిగించేందుకు యత్నించారని ఫిర్యాదు దాఖలైంది. తనను కులం పేరుతో దూషించారని సీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఏ1గా పట్టాభి, ఏ2గా దొంతు చిన్నా, ఇంకా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదయ్యాయి. ఈ ఘర్షణలకు సంబంధించి మొత్తం 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. పట్టాభి స్పందిస్తూ, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి తెలిపారు. తోట్లవల్లూరు పీఎస్ లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వెల్లడించారు.

పీఎస్ లో అడుగుపెట్టేసరికి అక్కడంతా చీకటిగా ఉందని తెలిపారు. ముసుగువేసుకుని ముగ్గురు వ్యక్తులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి, తనను వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారని పట్టాభి వివరించారు. అరికాళ్లు, అరచేతులపై తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తికి తెలిపారు. వాదనలు విన్న అనంతరం పట్టాభి, తదితరులు రెండు వారాల రిమాండ్ విధించారు. పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అంతకుముందు పట్టాభి భార్య చందన మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తను కొట్టారని ఆరోపించారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనను కొట్టారని చందన అన్నారు. ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకొచ్చి కొట్టారని.. తన భర్తకు ప్రాణహాని వుందని ఆమె ఆరోపించారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన తర్వాత తన భర్త కొమ్మారెడ్డి పట్టాభిరాం కనిపించడం లేదంటూ ఆయన భార్య చందన ఆందోళనకు దిగారు. నిన్న(సోమవారం) సాయంత్రం అరెస్ట్ చేసిన తన భర్తను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదు… ఆయనకు ఏదయినా హాని తలపెడితే సీఎం జగన్, డిజిపి బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. భర్త ఆచూకీ తెలపాలంటూ చందన డిజిపి ఇంటిముందు ధర్నాకు సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో తన ఇంటిముందే కుటుంబ సభ్యులతో కలసి దీక్ష చేపట్టారు. భర్త ఆఛూకీ కోసం ఆందోళన చేపడుతున్న చందనకు ఫోన్ చేసి పరామర్శించిన వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ధైర్యం చెప్పారు. ఏపీ నూతన గవర్నర్ నజీర్‌ను కలిసి పరిస్థితిని వివరిస్తానని.. అధైర్యపడొద్దని చందనకు భరోసా ఇచ్చారు రఘురామ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..