Fact Check on APSRTC Jobs: ‘దయచేసి నమ్మకండి.. అది ఫేక్ న్యూస్! ఉద్యోగాల భర్తీకి ఎటువంటి ప్రకటన చేయలేదు’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో 5,418 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించారు. తాము ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ మంగళవారం (ఫిబ్రవరి 21) ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో 5,418 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించారు. తాము ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ మంగళవారం (ఫిబ్రవరి 21) ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి నకిలీ ప్రకటనలు నమ్మి నిరుద్యోగ అభ్యర్థులు మోసపోవద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కాగా గత కొంతకాలంగా ఏపీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్-2023 పేరుతో వాట్సాప్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలో ఆర్టీసీలో భర్తీకానున్న డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలకు ఆశావహ అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ వాట్సాప్‌లో చాలా మందికి మెసేజ్‌లు ఫార్వర్డ్‌లు వచ్చాయి. దీనిపై తాజాగా స్పందించిన ఆర్టీసీ అధికారులు ప్రకటనలో ఈ విధంగా పేర్కొన్నారు..
‘గతంలో ఇలాగే కొందరు ఫేక్ మెయిల్స్ ద్వారా చాలా మందిని మోసం చేసే చర్యలకు పాల్పడ్డారని, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలా సులభంగా ఇలాంటి నకిళీ వార్తలను పంపుతున్నారని ఆర్టీసీ తెలిపింది. అభ్యర్థులు ముందుగానే ఫీజు చెల్లించాలని దానితో పాటు ఆధార్ కార్డులు, బ్యాంకు ఓటీపీ తదితర వివరాలన్నీ అందులో తెలపాలని సూచిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మీ వివరాలన్నీ సేకరించిన తర్వాత సైబర్ మోసాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ కోరుతున్నది. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ఉంటే ఆర్టీసీ అధికారులే మీడియా ద్వారా గాని, పత్రికల ద్వారా గాని ఆ విషయాన్నీ అందరికీ తెలియజేసి అధికారికంగా ప్రకటిస్తారు. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మకండి. వీటి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ అధికారులు తాము విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.