Lychee Benefits: వేసవిలో తప్పక తినాల్సిన పండు ఇది.. తింటే ఎన్ని ప్రయోజనాలో.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
వేసవికాలంలో వీచే వేడి గాలులు, కాచే మండుటెండల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కొన్ని రకాల పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలని..
మన ఆరోగ్యాన్ని కాపాడడంలో పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా సీజనల్ ఇన్ఫెక్షన్లను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి కావలసిన వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే వీటిలోని పోషకాలు మనకు ఎన్నోరకాలుగా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే రానున్నది వేసవి కాలం. వేసవికాలంలో వీచే వేడి గాలులు, కాచే మండుటెండల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కొన్ని రకాల పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. వేసవి కాలంలో పండ్లు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయని, డీహైడ్రేషన్ వంటి సమస్యల బారిన పడకుండా కూడా సంరక్షిస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వేసవిలో లిచీ పండ్లను తినడం అవసరమని సూచిస్తున్నారు. ఈ పండులో ఉండే వివిధ రకాల పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడి, మనం దృఢంగా ఉండేలా చేస్తాయని పేర్కొంటున్నారు. మరి ఈ లిచీ పండ్ల ప్రత్యేకత, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
- చర్మ సంరక్షణ: లీచీలో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిజన్ లోపం వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో చర్మం పొడిబారడం, ఎర్రబడడం వంటి సమస్యలను నివారించడానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
- వృద్ధాప్య ఛాయల నివారణ: వృద్ధాప్యఛాయలను తొలగించడలోనూ లిచీ పండ్లు సహాయపడతాయి. అధిక ఆక్సిడేటివ్ ఒత్తిడి కారణంగా శరీరంలో ఫ్రీరాడికల్స్ పెరిగిపోతాయి. ఇది వృద్ధాప్య ప్రారంభ సంకేతాలుగా చెప్పొచ్చు. అయితే లిచీలో ఉండే విటమిన్ సీ.. శరీరంలో నుంచి ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపిస్తుంది. స్కిన్ డ్యామేజిని నిరోధిస్తుంది.
- బరువు తగ్గడం: బరువు తగ్గాలని అనుకునేవారికి లిచీ పండ్లు గొప్ప మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారికి ఎంతో మేలు చేస్తుంది. క్యాలరీలు కూడా ఇందులో తక్కువగానే ఉంటాయి.
- ఎముకల దృఢత్వం: లిచీ పండ్లలో మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, మాంగనీస్, కాపర్ వంటి న్యూట్రీషియన్లు పుష్కలంగా ఉంటాయి. ఎముకలు కాల్షియాన్ని గ్రహించే స్థాయిని ఇవి ఎంచుతాయి. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా తయారవుతాయి.
- ఇమ్యూనిటీ: లిచీ పండ్లలో విటమిన్ సీ సమృద్ధిగా ఉండడం వల్ల మన శరీర వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. అలాగే అలాగే మన శరీరానికి అవసరమయ్యే ఆస్కార్బిక్ ఆమ్లం కూడా ఈ పండు ద్వారా పుష్కలంగా లభిస్తుంది. తద్వారా శరీరంలో తెల్ల రక్తకణాల సామర్థ్యం పెరగడంతో పాటు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
- జీర్ణక్రియ: లిచీ పండ్లలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ట్రిక్, జీర్ణక్రియకు అవసరమైన ద్రవాలను స్థిరీకరించి మలబద్దకాన్ని నిరోధిస్తుంది.
- రక్త ప్రసరణ: లిచీ పండ్లలో ఉండే కాపర్.. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే ఎర్ర రక్తకణాల వృద్ధి కోసం లిచీ పండ్లలో ఉండే కాపర్, ఐరన్ సహాయపడతాయి. రక్తంలోని ద్రవాలను సంతులితం చేయడం ద్వారా హైబీపీని నియంత్రించడంలో లిచీ పండ్లు సహాయపడతాయి. లిచీ పండల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. సోడియం తక్కువగా ఉంటుంది. ఇవి రక్తప్రసరణను నియంత్రిస్తాయి.
- గుండె ఆరోగ్యం: లిచీ పండ్లలో గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి. వీటిల్లో ఉండే బీటాకెరోటిన్, ఓలిగోనల్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ధమనులు, రక్తనాళాలను లిచీ పండ్లలో ఉండే పొటాషియం ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది వాటి సంకోచ, వ్యాకోచాలను మెరుగ్గా ఉంచుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా జరిగి గుండెపోటు వచ్చే ముప్పు తగ్గుతుంది.