తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు.. ఉష్టోగ్రతల వివరాలవే..
ఫిబ్రవరి నెల అయిపోకుండానే వేసవి కాలాన్ని తలపించేలా ఎండలు, ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఫిబ్రవరి..
మార్చి రాకముందే తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి నెల అయిపోకుండానే వేసవి కాలాన్ని తలపించేలా ఎండలు, ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఫిబ్రవరి నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రత 35.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఫిబ్రవరి 13న గరిష్టంగా 35.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలోనే వేసవికాలం ప్రారంభమైందని భావించవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరిలో ఇప్పటి వరకు అత్యధికంగా ఉష్ణోగ్రత 13న నమోదవ్వగా.. ఇది రోజువారీ సగటు ఉష్ణోగ్రత 32.5 డిగ్రీల సెల్సియస్ కంటే మూడు డిగ్రీలు ఎక్కువ.
ఉత్తర తెలంగాణలో కూడా అంతే..
ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ బేగంపేట వాతావరణ శాక అబ్జర్వేటరీలో 35.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కాగా, ఈ సంవత్సరం ఇప్పటి వరకు అత్యంత గరిష్ఠ ఉష్ణగ్రత ఇదే కావడం విశేషం. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
తెలంగాణ వెదర్ రిపోర్ట్:
Heat to further rise in Telangana from tomorrow in Telangana with temperatures likely to cross 39°C at few places after Feb 20. Parts of Hyderabad too can witness 35-36°C heat after Feb 20 ?
Slowly from now onwards night chill will also gradually reduce in step wise manner
— Telangana Weatherman (@balaji25_t) February 18, 2023
హైదరాబాద్‌లో 21 రోజుల్లో 35పై ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందన్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాబోయే రోజుల్లోనూ తెలంగాణలో వేడి కొనసాగుతుందని బాలాజీ ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో కొన్ని చోట్ల 39.9 డిగ్రీల సెల్సియస్‌ను దాటే అవకాశం ఉందని, వారం రోజుల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉందని బాలాజీ ట్వీట్ చేశారు.
రెండేళ్లలో ఇదే మొదటి సారి:
ఈ ఏడాది అంటే 2023లో తెలంగాణలో గత రెండేళ్లతో పోలిస్తే వేడి ఎక్కువగా ఉంటుందని, నగరంలో మిశ్రమ వాతావరణం ఉటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ వెల్లడించారు. పగటిపూట వేడిగానూ, రాత్రిపూట చల్లగానూ ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం వేసవి మరింత మండనుంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశాలున్నాయి. అయితే హైదరాబాదులో అత్యధికంగా మేలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..