Telangana: ప్రేమంటూ.. పెళ్లి చేసుకుంటానంటూ.. శారీరకంగా లోబర్చుకున్నాడు.. కానీ చివరికి..
Lover Cheated Girl Friend: ఆమె వికలాంగురాలని తెలిసినా వెంటబడ్డాడు, స్నేహం, ప్రేమ అంటూ దగ్గరయ్యాడు, పెళ్లి చేసుకుంటానంటూ శారీరంగా లోబర్చుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీలో చూడండి.
హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో జరిగిందీ ఇన్సిడెంట్. బాలరాజ్, మమత.. ఇద్దరిదీ కల్వకోల్ గ్రామమే. అయితే, మమత వికలాంగురాలు. అది తెలిసి కూడా మమతకు దగ్గరయ్యాడు బాలరాజ్. ముందు స్నేహం అంటూ మాట కలిపి, ఆ తర్వాత ప్రేమన్నాడు. చివరికి పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను శారీరంగా లోబర్చుకున్నాడు.
ప్రేమ పేరుతో తన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా డబ్బులు కూడా గుంజేవాడు బాలరాజ్. అయితే, పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో సర్వస్వం అర్పించిన మమతను మోసంచేసి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. దాంతో, మహిళా సంఘాలతో కలిసి బాలరాజ్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది మమత.
ప్రేమ పేరుతో తనను మోసం చేయడమే కాకుండా నువ్వు అవిటిదానివంటూ వేధించాడని అంటోంది. మమత ఆందోళనతో ఇంటికి తాళమేసి పరారయ్యారు బాలరాజ్ కుటుంబ సభ్యులు. దాంతో, బాలరాజ్‌తో తనకు పెళ్లి జరిపించాలని పోలీసులకు కంప్లైంట్ చేసింది మమత.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..