AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char Dham Yatra 2023: చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. వాట్సాప్‌లోనే చేసేసుకోండిలా..!

చార్‌ధామ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 21 ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైనందున చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకున్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రిజస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి , గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాల సందర్శన యాత్రను చార్‌ధామ్ అంటారని మనకు తెలిసిందే.  అయితే ప్రస్తుతం కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గంగోత్రి మరియు యమునోత్రి ధామ్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ […]

Char Dham Yatra 2023: చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. వాట్సాప్‌లోనే చేసేసుకోండిలా..!
Char Dham Yatra 2023 Registration
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 23, 2023 | 1:43 PM

Share

చార్‌ధామ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 21 ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైనందున చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలనుకున్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రిజస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి , గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాల సందర్శన యాత్రను చార్‌ధామ్ అంటారని మనకు తెలిసిందే.  అయితే ప్రస్తుతం కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గంగోత్రి మరియు యమునోత్రి ధామ్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు ఆయా పుణ్య క్షేత్రాల్లో రద్దీని నివారించడానికి ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేశారు ఉత్తరాఖండ్ అధికారులు. ఈ నేపథ్యంలో మొదటి దశలో కేదార్‌నాథ్‌కు ప్రతిరోజూ 9000, బద్రీనాథ్‌కు 10000 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతాయి.

అయితే కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లలో ప్రయాణీకుల సామర్థ్యం వరుసగా 15000, 18000గా నిర్ణయించారు అధికారులు. అంతేకాక ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ ధామ్ యాత్ర కోసం రాష్ట్రాన్ని సందర్శించడానికి భక్తులు ఫోటోమెట్రిక్/బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్‌ని ఎంచుకోవడాన్ని తప్పనిసరి చేసింది. 2014 కేదార్‌నాథ్ వరదలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నారు. ఇక ఏప్రిల్ 22న గంగోత్రి, యమునోత్రి, ఏప్రిల్ 25న కేదార్‌నాథ్, ఏప్రిల్ 27న బద్రీనాథ్ క్షేత్రాల తలుపులు తెరుచుకుంటాయి. ఇటీవలి కాలంలో బద్రీనాథ్ ముఖద్వారమైన జోషీమఠ్‌లో కొండచరియలు విరిగిపడి ఇళ్లలో పగుళ్లు ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలి..?

  • చార్ ధామ్ యాత్రకు వెళ్లానుకునేవారు రిజిస్ట్రేషన్ కోసం registrationandtouristcare.uk.gov.in అనే వెబ్‌సైట్‌కు వెళ్లాలి. 
  • అనంతరం చార్‌ధామ్ యాత్ర 2023 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/లాగిన్ ఫారమ్‌ను యాక్సెస్ చేయడానికి, రిజిస్టర్/లాగిన్‌పై క్లిక్ చేయండి.
  • అనంతరం మీ పేరు, అడ్రస్ తదితర వివరాలు నింపాలి.
  • రిజిస్ట్రేషన్ తర్వాత మొబైల్ లేదా ఈమెయిల్‌కు OTP వస్తుంది.
  • OTP ద్వారా లాగిన్ అవ్వాలి.
  • అనంతరం యాడ్/మేనేజ్ పిల్‌గ్రిమ్స్ లేదా టూరిస్ట్‌లపై క్లిక్ చేయండి.
  • ఆపై  పర్యటన రకం, పర్యటన పేరు, యాత్ర తేదీలు, పర్యాటకుల సంఖ్య, ప్రతి గమ్యస్థానం సందర్శించవలసిన తేదీ వంటి టూర్ ప్లాన్ వివరాలను నమోదు చేయండి.
  • అలా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీరు ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్‌తో SMS అందుకుంటారు. చార్‌ధామ్ యాత్ర ప్రయాణం కోసం రిజిస్ట్రేషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలుగుతారు.

WhatsApp ద్వారా కూడా:

WhatsApp ద్వారా చార్‌ధామ్ యాత్రను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం 8394833833 వాట్సాఫ్ నంబర్‌కు ‘Yatra’ అని మెసేజ్ చేయండి. ఆ తర్వాత సిస్టమ్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటికి జవాబు ఇస్తే చాలు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లే. అలాగే చార్‌ధామ్ యాత్ర కోసం టోల్ ఫ్రీ నంబర్ 01351364 కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!