AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samudrik Shastra: శరీరంపై అక్కడ పుట్టుమచ్చలు ఉంటే ధనవంతులవుతారు..!

Lucky Mole: సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి శరీరంపై ఉండే పుట్టుమచ్చల ఆధారంగా అంచనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి శరీరంపై పుట్టుమచ్చలు తప్పకుండా ఉంటాయి. అయితే, ప్రతి పుట్టుమచ్చ శుభానికి సంకేతం అని భావించొద్దు.

Samudrik Shastra: శరీరంపై అక్కడ పుట్టుమచ్చలు ఉంటే ధనవంతులవుతారు..!
Samudrik Shastra
Shiva Prajapati
|

Updated on: Feb 23, 2023 | 11:01 AM

Share

సాముద్రిక శాస్త్రంలో ఒక వ్యక్తి శరీరంపై ఉండే పుట్టుమచ్చల ఆధారంగా అంచనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి శరీరంపై పుట్టుమచ్చలు తప్పకుండా ఉంటాయి. అయితే, ప్రతి పుట్టుమచ్చ శుభానికి సంకేతం అని భావించొద్దు. పుట్టుమచ్చ ఉన్న ప్రదేశం.. దాని పరిమాణం ఏంటి అన్నదానిని బట్టి సాముద్రిక శాస్త్రంలో ఫలితాలను పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం.. కొన్ని చోట్ల ఉండే పుట్టుమచ్చలు వారికి అదృష్టాన్ని, సంపదకు కారణం అవుతాయి. మరి ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే మంచి జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గడ్డం మీద పుట్టుమచ్చ..

సాముద్రికశాస్త్రం ప్రకారం.. గడ్డం మీద పుట్టుమచ్చ ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇక్కడ పుట్టుమచ్చ ఉండటం వల్ల వక్యి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దీంతో పాటు, ఈ వ్యక్తులు డబ్బు సంపాదించడానికి చాలా ఎక్కువ ఆసక్తి చూపుతారు. గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు గ్రూమింగ్ పట్ల ఎక్కువ ఇష్టపడతారు. ఈ మహిళలు ఫ్యాషన్ కోసం చాలా ఖర్చు చేస్తారు. అలాగే వారు అదృష్టవంతులు.

అరచేతిలో పుట్టుమచ్చ..

సాముద్రిక శాస్త్రం ప్రకారం.. అరచేతిలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు అదృష్టవంతులు. ఈ వ్యక్తులు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉంటారు. అలాగే, ఈ వ్యక్తులు కళా ప్రేమికులు. ప్రయాణాలను ఇష్టపడతారు. వీరు ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు. ఆత్మగౌరవం కలిగి ఉంటారు. అయితే ఈ వ్యక్తులు కాస్త బద్ధకంగా ఉంటారు. దానివల్ల వారికే నష్టం.

ఇవి కూడా చదవండి

వీపుపై పుట్టుమచ్చ..

వీపుపై పుట్టుమచ్చ ఉన్నవారు అదృష్టవంతులు. వీరు కాస్త ఫన్నీ స్వభావం కలిగి ఉంటారు. నిర్భయంగా ఉంటారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. దీంతో పాటు, ఈ వ్యక్తులు చిన్న వయస్సులో ధనవంతులు అవుతారు. తమ జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు.

ఉంగరపు వేలుపై పుట్టుమచ్చ..

సాముద్రికశాస్త్రం ప్రకారం.. ఉంగరపు వేలిపై పుట్టుమచ్చ ఉన్నవారు ఆచరణాత్మకంగా, సామాజికంగా ఉంటారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు, ప్రజాదరణ కలిగి ఉంటారు. వీరు సూటిగా, సుత్తిలేకుండా మాట్లాడుతారు. చెప్పాల్సింది నేరుగా, భయం లేకుండా చెప్పేస్తారు.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు మత విశ్వాసాలు, మతగ్రంధాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..