Metro Train – WhatsApp: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మొబైల్‌లోనే టికెట్ బుకింగ్స్..

మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది అద్దిరిపోయే వార్త. వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించి అన్ని పనులు చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు టికెట్స్ బుకింగ్ చేసుకోవడం,

Metro Train - WhatsApp: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మొబైల్‌లోనే టికెట్ బుకింగ్స్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 22, 2023 | 1:59 PM

మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది అద్దిరిపోయే వార్త. వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించి అన్ని పనులు చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు టికెట్స్ బుకింగ్ చేసుకోవడం, కొనుగోలు చేయడం, క్యాన్సిల్ చేయడం, స్మార్ట్ కార్డ్స్ రీచార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అంతేకాదు.. వాట్సాప్ చాట్‌బాట్‌లో ప్రయాణం గురించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. మెట్రోరైల్ సర్వీస్ ప్రొవైడర్లకు సపోర్ట్‌గా, రోజువారీ ప్రయాణికుల సౌకర్యార్థం వాట్సాప్ ఈ కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది.

బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణే మెట్రో ట్రైన్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది నిజంగా శుభవార్త. మెట్రో టికెట్ కొనుగోలు చేయడానికి, స్మార్ట్ కార్డ్స్ రీచార్జ్ చేయడానికి ఇకపై లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్‌తో మెట్రోరైల్ సర్వీస్ చేతులు కలిపింది. వాట్సాప్ బిజినెస్ చాట్‌బాట్ ద్వారా ప్రయాణికులు.. తమకు అవసరైన సమాచారం, టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సిల్, స్మార్ట్ కార్డ్ రీచార్జ్, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.

వాట్సాప్ చాట్‌బాట్ ఫీచర్ ప్రయోజనాలు..

1. ఈ ఫీచర్‌ని ఉపయోగించి ప్రయాణికులు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు/కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

2. ట్రాన్సిట్ టిక్కెట్‌లను రద్దు చేసుకోవచ్చు లేదా టాప్ అప్ చేయవచ్చు.

3. రైలు షెడ్యూల్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు.

4. కొత్త ఫీచర్ ద్వారా రూట్ మ్యాప్‌లు, ఫేర్ బ్రేక్‌డౌన్‌లను కూడా ట్రాక్ చేయవచ్చు.

వాట్సాప్ చాట్‌బాట్ ఎలా పని చేస్తుంది..

1. ప్రస్తుతానికి బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణేలోని ప్రయాణికులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

2. ఈ నాలుగు పట్టణాల ప్రయాణికులు తమ స్థానిక భాష లేదా ఇంగ్లీష్‌లో చాట్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.

3. చాట్‌బాట్ యాక్టీవేట్ చేయడానికి ప్రయాణికులు ‘Hittps://wa.me/+918105556677’కి ‘హాయ్’ అని మెసేజ్ పంపాలి.

4. చాట్ బాట్ యాక్టివేట్ అయ్యాక మీరు ఇ-టికెట్‌ను బుక్ చేసుకోవడానికి URLని అందుకుంటారు.

5. URL ఎండ్-టు-ఎండ్ డిజిటల్ పేమెంట్ చేసిన తరువాత టికెట్ బుకింగ్ అవుతుంది.

6. ఇ-టికెట్ ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ వద్ద ధృవీకరించడం జరుగుతుంది.

7. కొత్త వాట్సాప్ చాట్‌బాట్ సిస్టమ్‌తో పాటు మెట్రో టికెట్ కౌంటర్, స్మార్ట్ కొనుగోలు కేంద్రం వంటి సేవలు యధావిధిగా పనిచేస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్