Fake Currency Detection: 2 వేల నోటు అసలైనదా? నకిలీదా?.. ఇలా ఈజీగా కనిపెట్టండి..!

Fake Currency Detection: కాదేదీ నకిలీకి అనర్హం అనే పరిస్థితి ప్రస్తుతం ఉంది. నకిలీ అంశాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది కరెన్సీ నోట్లు. ఫేక్ కరెన్సీ నోట్లతో ప్రజలను మోసం చేయడం, ఆర్థిక వ్యవస్థను మోసగించడం చేస్తుంటారు కేటుగాళ్లు.

Fake Currency Detection: 2 వేల నోటు అసలైనదా? నకిలీదా?.. ఇలా ఈజీగా కనిపెట్టండి..!
Currency Checking
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 22, 2023 | 2:02 PM

కాదేదీ నకిలీకి అనర్హం అనే పరిస్థితి ప్రస్తుతం ఉంది. నకిలీ అంశాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది కరెన్సీ నోట్లు. ఫేక్ కరెన్సీ నోట్లతో ప్రజలను మోసం చేయడం, ఆర్థిక వ్యవస్థను మోసగించడం చేస్తుంటారు కేటుగాళ్లు. అచ్చం ఒరిజినల్ నోట్ల మాదిరిగానే.. ఫేక్ కరెన్సీని సృష్టించి మార్కెట్‌లో చెలామణి చేస్తుంటారు. సామాన్య ప్రజలు ఈ నకిలీ నోట్లు, అసలు నోట్ల మధ్య తేడా గుర్తించక మోసపోతుంటారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నకిలీ కరెన్సీ వల్ల ద్రవ్యోల్బం పెరుగుతుంది. కరెన్సీ విలువ తగ్గిపోతుంది. ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కోల్పోతారు.

అయితే, ఈ నకిలీ నోట్ల బెడద తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం.. పెద్ద నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకువచ్చింది. కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ విషయంలో ఆర్బీఐ కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ.. కేటుగాళ్లు తగ్గడం లేదు. కొత్త నోట్లను సైతం ట్రాప్ చేసి.. నకిలీ నోట్లను సృష్టిస్తున్నారు. ఆర్‌బీఐ జారీ చేసిన రూ. 2,000 నోట్లు మన కరెన్సీలో అతిపెద్ద నోటు. దీనిని కూడా టాంపర్ చేశారు కేటుగాళ్లు. మార్కెట్‌లో నకిలీ 2వేల నోట్లు చాలానే చలామణి అవుతున్నాయి. మరి వాటిని ఎలా గుర్తించాలి. వాటిని ఎలా అరికట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Currency Note

ఇవి కూడా చదవండి

1. డినామినేషనల్ సంఖ్య 2000తో రిజిస్టర్ చేయబడుతుంది.

2. డినామినేషనల్ సంఖ్య 2000తో రహస్యంగా ఉంటుంది.

3. దేవనాగరిలో డినామినేషనల్ సంఖ్య 2000 ఉంటుంది.

4. మధ్యలో మహాత్మా గాంధీ చిత్రపటం ఉంటుంది.

5. ‘భారత్’, ‘ఇండియా’ అని సూక్ష్మ అక్షరాలు ఉంటాయి.

6. ‘భారత్’, ‘RBI’ ‘2000’ అని రాసి.. కలర్ షిఫ్ట్ విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. నోటును వంచినప్పుడు థ్రెడ్ రంగు ఆకుపచ్చ నుండి నీలంకి మారుతుంది.

7. గ్యారంటీ క్లాజ్, ప్రామిస్ క్లాజ్‌తో గవర్నర్ సంతకం, మహాత్మా గాంధీ చిత్రపటం కుడివైపున RBI చిహ్నం ఉంటుంది.

8. మహాత్మా గాంధీ పోర్ట్రెయిట్, ఎలక్ట్రోటైప్ (2000) వాటర్‌మార్క్‌లు ఉంటాయి.

9. ఎగువ ఎడమ వైపు, దిగువ కుడి వైపున ఆరోహణ ఫాంట్‌లో సంఖ్యలతో నెంబర్ ప్యానెల్ ఉంటుంది.

10. రూపాయి చిహ్నంతో డినామినేషనల్ సంఖ్య 2,000 ఉంటుంది. ఇది రంగు మారుతున్నట్లుగా ఉంటుంది.(ఆకుపచ్చ నుండి నీలం)

11. కుడివైపున అశోక స్తంభం చిహ్నం ఉంటుంది.

దృష్టి లోపం ఉన్నవారికి కొన్ని లక్షణాలు..

12. మహాత్మా గాంధీ పోర్ట్రెయిట్ (4), అశోక స్తంభ చిహ్నం (11), కుడివైపు 2,000తో సమాంతర దీర్ఘ చతురస్రం గుర్తు, ఎడమ, కుడి వైపులా ఏడు కోణీయ బ్లీడ్ లైన్‌ల ఇంటాగ్లియో, రైజ్డ్ ప్రింటింగ్ ఉంటుంది.

13. ఎడమవైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది.

14. స్వచ్ఛ భారత్ నినాదంతో లోగో ఉంటుంది.

15. భాషా ప్యానెల్ ఉంటుంది.

16. మంగళయాన్ చిహ్నం ఉంటుంది.

17. దేవనాగరి లిపిలో డినామినేషనల్ సంఖ్య 2000 ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..