Delhi Mayor Election: ఆప్‌దే ఢిల్లీ మేయర్ పీఠం.. బీజేపీ అభ్యర్ధి రేఖా గుప్తాపై షెల్లీ ఒబెరాయ్‌‌పై ఘన విజయం..

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ మేయర్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆప్‌ అభ్యర్ధి షెల్లీ ఒబెరాయ్‌ మేయర్‌గా ఘన విజయం సాధించారు.

Delhi Mayor Election: ఆప్‌దే ఢిల్లీ మేయర్ పీఠం.. బీజేపీ అభ్యర్ధి రేఖా గుప్తాపై షెల్లీ ఒబెరాయ్‌‌పై ఘన విజయం..
Shelly Oberoi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 22, 2023 | 2:42 PM

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ మేయర్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆప్‌ అభ్యర్ధి షెల్లీ ఒబెరాయ్‌ మేయర్‌గా ఘన విజయం సాధించారు. ఢిల్లీ సివిక్‌ సెంటర్‌లో కౌంటింగ్‌ జరిగింది. మేయర్‌ ఎన్నికల్లో గెలవడంతో ఆప్‌ నేతలు సంబరాలు చేసుకున్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నామినేట్‌ చేసిన సభ్యులకు ఓటు వేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వలేదు.

ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల అనంతరం.. మేయర్ ఎన్నిక ఉత్కంఠగా కొనసాగుతూ వచ్చింది. అయితే, బీజేపీ, ఆప్ ఘర్షణల మధ్య మూడు సార్లు వాయిదా పడింది. బుధవారం నిర్వహించిన ఈ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రేఖా గుప్తాపై షెల్లీ ఒబెరాయ్‌ గెలిచారు. ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఎట్లు లభించగా, బీజేపీ అభ్యర్ధి రేఖా గుప్తాకు 116 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఎన్నికల ఫలితాల అనంతరం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మేయర్‌ ఎన్నికల్లో రౌడీలు ఓడిపోయారని , ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా.

మూడు సార్లు వాయిదా పడ్డ ఢిల్లీ మేయర్‌ ఎన్నిక సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..