AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

People Card: గూగుల్‌లో మీకంటూ ఓ గుర్తింపు కావాలనుకుంటున్నారా.? ఈ సింపుల్‌ ట్రిక్‌ ఫాలో అయితే సరి.

ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ గుర్తింపును కోరుకుంటున్నారు. మారుతోన్న డిజిటల్‌ ప్రపంచానికి అనుగుణంగా ఇంటర్‌నెట్‌లోనూ ఈ గుర్తింపును కోరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. గూగుల్‌ సెర్చ్‌లో తమ పేరును సెర్చ్‌ చేస్తే వారి పేరుపై సమాచారం రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే..

People Card: గూగుల్‌లో మీకంటూ ఓ గుర్తింపు కావాలనుకుంటున్నారా.? ఈ సింపుల్‌ ట్రిక్‌ ఫాలో అయితే సరి.
Google People Card
Narender Vaitla
|

Updated on: Feb 22, 2023 | 7:00 AM

Share

ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ గుర్తింపును కోరుకుంటున్నారు. మారుతోన్న డిజిటల్‌ ప్రపంచానికి అనుగుణంగా ఇంటర్‌నెట్‌లోనూ ఈ గుర్తింపును కోరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. గూగుల్‌ సెర్చ్‌లో తమ పేరును సెర్చ్‌ చేస్తే వారి పేరుపై సమాచారం రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే గూగుల్ ఓ ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ‘పీపుల్ కార్డు’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌.. గూగుల్‌లో సెర్చ్‌ చేసినప్పుడు సరైన వ్యక్తిని గుర్తించటానికిది ఉపయోగపడుతుంది.

గూగుల్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌లో గూగుల్‌ మనకు సంబంధించిన సమాచారాన్ని ప్రముఖంగా చూపడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ భారత్‌తో పాటు కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాల్లోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషల్లో దీన్ని సెట్‌ చేసుకోవచ్చు. ఇంతకి ఈ పీపుల్ కార్డును ఎలా రూపొందించుకోవాలి.? ఇందు కోసం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్‌ ఏంటి.? లాంటి వివరాలు మీకోసం..

* ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం ‘యాడ్‌ మీ టు సెర్చ్‌’ అని టైప్‌ చేయాలి.

* వెంటనే ‘యాడ్‌ యువర్‌సెల్ఫ్‌ టు గూగుల్‌ సెర్చ్‌’ ఓపెన్‌ అవుతుంది. అందులోకి వెళ్లి ‘గెట్‌ స్టార్టెడ్‌’ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయాలి.

* అనంతరం మీ వ్యక్తిగత వివరాలైన.. పేరు, నివసించే ప్రాంతం, పని, చదువు, ఈమెయిల్‌, వెబ్‌సైట్‌లాంటి వివరాలను ఫిల్‌ చేయాలి.

* వీటితో పాటు అదనంగా మీ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు.

* కాంటాక్ట్‌ వివరాలు చూపించాలా.? వద్ద అన్న నిర్ణయాన్ని ఎంచుకోవచ్చు.

* పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూను సెలక్ట్‌ చేసుకోని అన్ని వివరాలను చెక్‌ చేసుకోవచ్చు.

* చివరిగా కార్డును సేవ్‌ చేసుకోవాలి. దీంతో మన పేరుతో సెర్చ్‌ చేసినప్పుడు గూగుల్ పీపుల్‌ కార్డు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు..
కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు..
బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడాచల్లగా
బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడాచల్లగా
పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా..
పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా..
Astrology: స్నేహం కోసం ప్రాణం పెట్టే 4 రాశులు ఇవే.. మీ రాశి ఈ..
Astrology: స్నేహం కోసం ప్రాణం పెట్టే 4 రాశులు ఇవే.. మీ రాశి ఈ..
మందులకు బై బై చెప్పేయండి.. డయాబెటిస్ ను తగ్గించే బెస్ట్ ఆకు ఇదే
మందులకు బై బై చెప్పేయండి.. డయాబెటిస్ ను తగ్గించే బెస్ట్ ఆకు ఇదే
మన పెద్దలు ఊరికే చెప్పలేదు.. అరిటాకులో తినడం వెనక 1000 ఏళ్ల..
మన పెద్దలు ఊరికే చెప్పలేదు.. అరిటాకులో తినడం వెనక 1000 ఏళ్ల..
భారత్‌కు భారీ షాక్.. ఆఖరి వన్డే నుంచి జస్సీ ఔట్
భారత్‌కు భారీ షాక్.. ఆఖరి వన్డే నుంచి జస్సీ ఔట్
సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా 'నిర్వాస్త్ర వ్రతం'..! వింత..
సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా 'నిర్వాస్త్ర వ్రతం'..! వింత..