Fish Rain: ఎడారి ప్రాంతంలో చేపల వర్షం.. దేవుడి ఆశీర్వాదం అంటున్న జనాలు..

ఆస్ట్రేలియాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు చుక్కే అరుదైన ఆ ప్రాంతంలో.. ఆకాశం నుంచి ఏకంగా చేపల వర్షం కురిసింది. అది చూసి జనాలు షాక్ అయ్యారు. దేవుడు ఆశీర్వాద ఫలితమే ఈ చేపల వర్షం అంటూ..

Fish Rain: ఎడారి ప్రాంతంలో చేపల వర్షం.. దేవుడి ఆశీర్వాదం అంటున్న జనాలు..
Fish Rain
Follow us

|

Updated on: Feb 22, 2023 | 1:59 PM

ఆస్ట్రేలియాలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు చుక్కే అరుదైన ఆ ప్రాంతంలో.. ఆకాశం నుంచి ఏకంగా చేపల వర్షం కురిసింది. అది చూసి జనాలు షాక్ అయ్యారు. దేవుడు ఆశీర్వాద ఫలితమే ఈ చేపల వర్షం అంటూ మురిసిపోయారు అక్కడి జనాలు. చేపల వర్షంతో ఎటు చూసినా చేపలే కనిపించాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని కేథరీన్‌కుు నైరుతి దిశలో దాదాపు 560 కిలోమీటర్ల దూరంలో టనామీ ఏడారి ఉంది. ఆ ఏడారి ఉత్తర అంచులో ఉన్న లాజమాను అనే పట్టణంలో భారీ వర్షం కురిసింది. ఆ వర్షంతోపాటే.. చేపలు భారీ సంఖ్యలో పడ్డాయి. అది చూసి లాజామ పట్టణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలుత వర్షం మాత్రమే పడుతుందని భావించగా.. కాసేపట్లోనే భారీ స్థాయిలో ఆకాశం నుంచి చేపలు పడటం మొదలైంది. కాసేపు అలాగే చేపల వర్షం కురిసిందని స్థానికులు చెబుతున్నారు.

ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయని లాజమాను పట్టణ ప్రజలు చెబుతున్నారు. 1974, 2004, 2014 లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, వాతావరణ నిపుణులు మాత్రం వేరే వెర్షన్ చెబుతున్నారు. భారీ సుడిగుండాలు, టోర్నడోలు నీటితో పాటు చేపలను తీసుకెళ్లి వందల కిలోమీటర్ల దూరంలో పడేస్తాయని చెబుతున్నారు. ఈ కారణంగా చేపలు ఆకాశం నుంచి పడతాయని వివరణ ఇస్తున్నారు.

అయితే, వర్షంతో పాటు ఆకాశం నుంచి పడిన చేపలు బతికే ఉన్నట్లు లాజమాను పట్టణ ప్రజలు చెబుతున్నారు. ఇది దేవుడి ఆశీర్వాదంగా పేర్కొంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు అక్కడి జనాలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..