Holi 2023: ఈ ఏడాది భద్రకాల సమయంలో హోలికా దహనం.. పూజ సమయం, నియమాలు తెలుసుకోండి

హిందువుల విశ్వాసం ప్రకారం.. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ లేదా చోటీ హోలీ అని అంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించే హోలికా దహనాన్ని నిర్వహించడానికి, మన గ్రంథాలలో కొన్ని ముఖ్యమైన నియమాలు పేర్కొనబడ్డాయి.

Holi 2023: ఈ ఏడాది భద్రకాల సమయంలో హోలికా దహనం.. పూజ సమయం, నియమాలు తెలుసుకోండి
Holika Dahan 2023
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Mar 02, 2023 | 4:26 PM

హిందువులు జరుపుకునే పండగల్లో ఒకటి హోలీ. ఇది రంగుల పండుగ.. వసంత కాలంలో ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున వచ్చే హొలీ పండుగను హిందువులు జరుపుకుంటారు. హోలికా దహన్ తర్వాత.. మర్నాడు రంగుల గొప్ప పండుగ హోలీని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ పవిత్రమైన తేదీ 07 ఫిబ్రవరి 2023 న వస్తుంది. హిందువుల విశ్వాసం ప్రకారం.. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ లేదా చోటీ హోలీ అని అంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించే హోలికా దహనాన్ని నిర్వహించడానికి, మన గ్రంథాలలో కొన్ని ముఖ్యమైన నియమాలు పేర్కొనబడ్డాయి. హోలీకా దహనం చేసే సమయంలో మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. హోలికా దహనం..  ఆరాధన విధానం, శుభ సమయం.. దానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన నియమాలను గురించి తెలుసుకుందాం.

హోలికా దహన్ ఆరాధనకు అనుకూలమైన సమయం పంచాంగం ప్రకారం.. ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ సంవత్సరం కూడా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున అంటే మార్చి 07, 2023, మంగళవారం నాడు హోలికా దహనం నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి తేదీ మార్చి 06, 2023న సాయంత్రం 04:17 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు మార్చి 07, 2023 సాయంత్రం 06:09 వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం భద్రుని నీడ కూడా హోలికా దహనం రోజున ఉంటుంది. అయితే అది ఫిబ్రవరి 07, 2023 ఉదయం 05:15 గంటలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం హోలికా దహన్‌కు అత్యంత అనుకూలమైన సమయం సాయంత్రం 06:24 నుండి రాత్రి 08:51 వరకు ఉంటుంది.

హోలికా దహనం పూజ  హోలికా దహనం చేసే సమయంలో వెలిగించిన అగ్నిని ఎల్లప్పుడూ శుభ సమయంలో చేయాలి. హోలీ పూజలో ఎండు కొబ్బరి,    గోధుమలు సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంలో ఆవు పేడతో చేసిన వస్తువులు, కొద్దిగా పసుపు, ఆవాలు, పువ్వులు, రంగులు మొదలైన వాటిని పూజలో సమర్పించాలి. హోళికను పూజించిన తర్వాత ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి. హోలికను దహనం చేసే ముందు శరీరంపై ఉబ్తాన్ పూయడం ఆచారం.

ఇవి కూడా చదవండి
  1. హోలికా దహన నియమాలు హిందూ విశ్వాసం ప్రకారం, అరటి, ఉసిరి, రావి చెట్టు, మర్రి, జమ్మి , తులసి, వేప మొదలైన వాటిని హోలికా దహనంలో ఉపయోగిస్తారు.  చెట్లు, మొక్కలు పూజించదగినవి. పచ్చని చెక్క లేదా మొక్కలను కాల్చడానికి ఎప్పుడూ ఉపయోగించరు.
  2. హోలికను కాల్చడానికి ఎండిన చింతచెట్టు, ఆవు పేడతో చేసిన పిడకలు మొదలైన వాటిని ఉపయోగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
  3. నల్లని వస్త్రాలు ప్రతికూల శక్తులను వేగంగా ఆకర్షిస్తాయని నమ్ముతారు. కాబట్టి ఒక వ్యక్తి హోలికా దహన్‌ను పూజించేటప్పుడు..  మంటలు పెట్టేటప్పుడు నల్లని బట్టలు ధరించకూడదు.
  4. ఎవరైనా స్త్రీ హోలీకా దహనం చేయబోతుంటే.. ఆమె తలను వస్త్రంతో కప్పుకుని హోలికను పూజించాలి.
  5. హోలికా దహన్ రాత్రి ఏ నిర్జన ప్రదేశానికి వెళ్లకుండా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)