Vastu Tips: ఇంట్లో సుఖ సంతోషాలు.. సానుకూల శక్తి కోసం ఇంటి తలుపు వద్ద వీటిని ఉంచండి..
వాస్తు విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా.. సమస్యలు చాలా వరకు నివారింబడతాయి. ఇంటి ప్రధాన ద్వారం వాస్తు పరంగా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది సానుకూల.. ప్రతికూల శక్తి ప్రవేశించే ప్రదేశం.. ఈ నేపథ్యంలో ఇంటి మెయిన్ డోర్ కు సంబంధించిన కొన్ని వాస్తు నివారణలు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రంలో .. ఇంటికి సంబంధించిన అనేక విషయాలు చెప్పబడ్డాయి. వీటిల్లో ఒకటి.. ఇంట్లో వ్యాపించే ప్రతికూల శక్తి.. ఆ శక్తివలన కలిగే ఇబ్బందులు గురించి.. అయితే ఇంటికి సంబంధించిన వాస్తు నియమాలను సరిగ్గా పాటించినట్లయితే.. ఒక వ్యక్తి జీవితంలో సానుకూల ప్రభావం రావడం ప్రారంభమవుతుంది. వాస్తు విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా.. సమస్యలు చాలా వరకు నివారింబడతాయి. ఇంటి ప్రధాన ద్వారం వాస్తు పరంగా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది సానుకూల.. ప్రతికూల శక్తి ప్రవేశించే ప్రదేశం.. ఈ నేపథ్యంలో ఇంటి మెయిన్ డోర్ కు సంబంధించిన కొన్ని వాస్తు నివారణలు తెలుసుకుందాం.
- ఏ ఇంటికైనా ప్రధాన ద్వారం అతి ముఖ్యమైన భాగం. ఇంటి ప్రధాన ద్వారం నుండి లక్ష్మీదేవి వస్తుందని విశ్వాసం. ప్రధాన ద్వారంపై స్వస్తిక్ ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని.. పరిశుభ్రతను ఎక్కువగా ఇష్టపడుతుందని ఒక నమ్మకం. ఓం శ్రీ గణేష్, శుభం- లాభం వంటి శుభ సంకేతాలు ఎల్లప్పుడూ సానుకూల శక్తిని కలిగి ఉంటాయి. అటువంటి ఇంటిలో లక్ష్మీదేవి నివసిస్తుంది.
- ఫెంగ్ షుయ్ వాస్తు శాస్త్రంలో విండ్ చైమ్‌లు చాలా పవిత్రమైనవి. సానుకూల శక్తితో నిండి ఉన్నాయి. ఇంటి మెయిన్ డోర్ వద్ద మెటల్ తో చేసిన విండ్ చైమ్ ను అమర్చాలి.
- ఇంటి మెయిన్ డోర్ చుట్టూ ఎప్పుడూ మురికి ఉండకూడదు. మెయిన్ డోర్ దగ్గర అక్కడక్కడా దుమ్ము లేదా బూట్లు, చెప్పులు చెల్లాచెదురుగా ఉన్న ఇళ్లలో అతి త్వరగా నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇలాంటి ఇంట్లో నివసించే సభ్యుల మధ్య వైరం పెరుగుతుంది.
- వాస్తు శాస్త్రంలో తులసి మొక్క చాలా పవిత్రమైనది. సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ప్రధాన ద్వారం చుట్టూ తులసి మొక్క ఉండే ఇళ్లలో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
- అశోకుని మొక్కలు కూడా చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఇంటి బయట అశోక మొక్కలు నాటడం వల్ల ఎలాంటి ప్రమాదాలు, వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ.
- ఇంటి మేయర్ డోర్ తలుపులకు అశోకం, మామిడి ఆకులతో తయారు చేసిన తోరణాలను పెట్టాలి. అలాగే.. మూడు నాణేలను ఎరుపు రిబ్బన్‌తో కట్టి, వాటిని ప్రధాన తలుపు దగ్గర వేలాడదీయండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)