Panch Maha Yoga: 700 ఏళ్ల తర్వాత పంచ మహాయోగం.. ఈ 3 రాశులవారికి పట్టిందల్లా బంగారమే..!

ఫిబ్రవరి 19న పంచ మహా యోగం ఏర్పడింది. మరోవైపు దాదాపు 700 ఏళ్లలో పంచ మహాయోగం ఏర్పడడం ఇదే తొలిసారి అని..

Panch Maha Yoga: 700 ఏళ్ల తర్వాత పంచ మహాయోగం.. ఈ 3 రాశులవారికి పట్టిందల్లా బంగారమే..!
Panch Maha Yoga
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 23, 2023 | 6:18 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాల ప్రభావం సకల మానవాళిపై ఉంటుంది. ఇదే విషయాన్ని మన కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు నమ్ముతూ వచ్చారు. ఈ క్రమంలో గ్రహ ప్రభావం కొన్ని రాశిచక్రాలపై శుభప్రదంగా, మరికొన్ని రాశిచక్రాలనకు అశుభంగా ఉంటుంది. అయితే ఫిబ్రవరి 19న పంచ మహా యోగం ఏర్పడింది. మరోవైపు దాదాపు 700 ఏళ్లలో పంచ మహాయోగం ఏర్పడడం ఇదే తొలిసారి అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ యోగం కారణంగా..  కొన్ని రాశులవారికి ధనవర్షం కురుస్తుందని, వారికి పట్టిందల్లా బంగారంగా మారుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరి ఈ క్రమంలో ఏయే రాశుల వారికి ఈ పంచమహాయోం శుభప్రదంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ధనుస్సు రాశి: పంచ మహాయోగం ఈ రాశివారికి ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు. ఈ సమయంలో వీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న లేదా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనువైనదని సూచిస్తున్నారు. అలాగే ఈ సమయంలో వ్యాపారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారు కోర్టు కేసుల్లో విజయం సాధించవచ్చని, ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

మిథున రాశి: పంచ మహాయోగం ఏర్పడడం వల్ల మిథునరాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే ఈ రాశులవారి జాతకంలో హంస, మాలవ్య అనే రెండు రాజయోగాలు ఉన్నాయి. అందుకే ఈ సమయంలో వీరు చేసే పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశం లభిస్తుంది. కార్యాలయంలో అధికారులు, సహోద్యోగుల పూర్తి సహకారం లభిస్తుంది. ఇంకా వీరి కీర్తి కూడా పెరుగుతుంది. ఈ సమయం వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కుంభరాశి: కుంభరాశిలో సూర్యుడు, శని సఖ్యతగా ఉండడం వల్ల కుంభరాశి వారికి పంచ మహాయోగం వరంలా ఉంటుంది. అపారమైన ధనలాభం కలుగుతుంది. వీరు పెద్ద మొత్తంలో ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. జీవితంలో లగ్జరీ పెరుగుతుంది. గొప్ప విజయం సాధించవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యం లేదా ఒప్పందాలకు మంచి కాలం. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. రాజకీయాలకు సంబంధించిన వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?