AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Astrology: ప్రేమికులకు మహా యోగం.. ఆ ఐదు రాశుల వారికి ఎక్కువ శుభ ఫలితాలు.. మీ రాశికి ఎలా ఉందంటే..?

Love Astrology: ఒక నెల రోజుల పాటు శుక్ర గ్రహం ఇక్కడ గురు గ్రహంతో కలిసి ఉంటుంది. అందువల్ల ఈ నెల రోజులు ప్రేమికుల జీవితాలలో శుభ పరిణామాలు చేసుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు అన్ని రాశుల వారికి వర్తించే అవకాశం ఉంది.

Love Astrology: ప్రేమికులకు మహా యోగం.. ఆ ఐదు రాశుల వారికి ఎక్కువ శుభ ఫలితాలు.. మీ రాశికి ఎలా ఉందంటే..?
Lovers
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 23, 2023 | 5:39 PM

Share
ప్రస్తుతం మీన రాశిలో గురు శుక్ర గ్రహాలు కలిసి ఉన్నాయి. మీన రాశి గురు గ్రహానికి స్వక్షేత్రం కాగా, శుక్ర గ్రహానికి ఉచ్ఛ క్షేత్రం. శుక్ర గ్రహానికి ఈ విధంగా బలం పట్టడం సాధారణంగా ప్రేమికులకు బాగా కలిసి వస్తుంది. ఒక నెల రోజుల పాటు శుక్ర గ్రహం ఇక్కడ గురు గ్రహంతో కలిసి ఉంటుంది. అందువల్ల ఈ నెల రోజులు ప్రేమికుల జీవితాలలో శుభ పరిణామాలు చేసుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు అన్ని రాశుల వారికి వర్తించే అవకాశం ఉంది. అయితే వృషభం, కర్కాటకం, కన్య, ధనస్సు, కుంభ రాశుల వారు అందరికంటే ఎక్కువగా శుభ ఫలితాలను అనుభవించే సూచనలు ఉన్నాయి.

1.వృషభ రాశి

ఈ రాశికి చెందిన ప్రేమికులు ప్రేమ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి అవకాశం ఉంది. ఇంకా ప్రేమలో పడని యువతీ యువ కులు సైతం ప్రేమలో పడడం జరుగుతుంది. సాధారణంగా వీరి ప్రేమలు పెళ్ళికి దారి తీసే సూచనలు ఉన్నాయి. పెద్దలు అంగీకరించడానికి అవకాశం ఉంది. ప్రేమ జీవితానికి సంబంధించినంత వరకు గత ఫిబ్రవరి 18 నుంచి వీరికి అదృష్ట కాలం ప్రారంభం అయింది. సహచరులు లేదా సహోద్యోగులతో వీరికి ప్రేమ బంధం కుదిరే సూచనలు ఉన్నాయి.

2.కర్కాటక రాశి

ఈ రాశి వారికి భాగ్య స్థానంలో గురు శుక్రులు కలసి ఉన్నాయి. అందువల్ల వీరి ప్రేమ జీవితం తప్పకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగి పోతుందని చెప్పవచ్చు. వీరి ప్రేమ జీవితం తప్పకుండా ఆనందంగా సాగిపోతుంది. విహార యాత్రలకు కూడా అవకాశం ఉంటుంది.  వీరికి పెద్దల ఆమోదం కూడా లభిస్తుంది. సాధారణంగా వీరు స్నేహం ద్వారా ప్రేమ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అనుకోని పరిచయం పెళ్ళికి దారితీస్తుంది.

3.కన్యా రాశి

ఈ రాశి వారికి సప్తమ రాశిలో అంటే పెళ్లికి సంబంధించిన రాశిలో గురు, శుక్ర గ్రహాలు కలవడం ఒక విధంగా అదృష్టమనే చెప్పాలి. ఫిబ్రవరి 18 తరువాత ప్రేమలో పడ్డవారు తప్పకుండా అన్యోన్యంగా జీవితాంతం కలిసి ఉండే అవకాశం ఉంది. వీరి వివాహం కూడా సాంప్రదాయబద్ధంగానే జరగవచ్చు. సాధారణంగా బంధు వర్గంలోని వారితో ప్రేమలో పడే అవకాశం ఉంది. వీరి ప్రేమ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా, పరిపూర్ణంగా సాగిపోయే సూచనలు ఉన్నాయి.

4.ధనుస్సు రాశి

ఈ రాశి వారికి నాలుగో రాశిలో అంటే సుఖ స్థానంలో గురు శుక్ర గ్రహాలు కలుసుకోవడం ఒక గొప్ప విశేషం. సాధారణంగా ఇరుగుపొరుగు వారితో లేదా పక్క ఫ్లాట్స్ వారితో లేదా ఉద్యోగంలో పక్క సీటు వారితో ప్రేమలో పడే అవకాశం ఉంది. వీరికి ప్రేమ జీవితం ప్రారంభం అయిన దగ్గర నుంచి అదృష్ట యోగం కూడా పడుతుంది. వీరి ప్రేమ జీవితానికి పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. వీరి పెళ్లి జీవితం కూడా అన్యోన్యంగా సాగిపోతుంది. సుఖ స్థానమైన నాలుగవ రాశిలో రెండు శుభ గ్రహాలు కలిసి ఉండటం ఒక గొప్ప అదృష్టంగా భావించవచ్చు.

5.కుంభ రాశి

ఈ రాశి వారికి రెండవ స్థానం అంటే కుటుంబ స్థానంలో రెండు శుభగ్రహాలు కలిసి ఉండటం నిజంగా మంచి అదృష్టం అని చెప్పాలి. ఈ రాశి వారి ప్రేమ జీవితం ఆనందదాయకంగా సాగిపోతుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు పెళ్లి ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఉంది. వీరి వివాహం కూడా వైభవంగా జరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ జీవితంలో కూడా వీరు విహార యాత్రలు, వినోద యాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..