AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘నిర్లక్ష్యం వల్లే బాలుడి మృతి’.. జీహెచ్ఎంసీపై హైకోర్డు సీరియస్..

అంబర్‌పేట వీధి కుక్కల దాడిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు కేసును మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్ అంబర్‌పేటలో నాలుగేళ్ల ప్రదీప్‌పై..

Telangana: ‘నిర్లక్ష్యం వల్లే బాలుడి మృతి’.. జీహెచ్ఎంసీపై హైకోర్డు సీరియస్..
Ts High Court On Amberpet Stray Dogs Attack Case
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 23, 2023 | 4:42 PM

Share

అంబర్‌పేట వీధి కుక్కల దాడిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు కేసును మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్ అంబర్‌పేటలో మూడు రోజుల క్రితం నాలుగేళ్ల ప్రదీప్‌పై వీధి కుక్కలు దాని చేయగా.. ఆ బాలుడు మరణించిన విషయం తెలిసిందే. వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించడంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకునేందుకు కావలసిన సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు వీధి కుక్కల దాడి కేసును సుమోటోగా స్వీకరించి ఈ రోజు(ఫిబ్రవరి 23) విచారణ జరిపింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని విచారణ సమయంలో హైకోర్టు ప్రశ్నించింది. ఇంకా అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడన్న హైకోర్టు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించింది.

ఇంకా ఈ విషయంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ, GHMC, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సేల్ అథారిటీ, అంబర్ పేట్ అధికారులకు నోటీసులు జారీ చేసింది కోర్టు. ఇంకా నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్న హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇక తదుపరి విచారణను మార్చ్ 16వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంపై ప్లేట్ ఫిరాయించిన బంగ్లా సర్కార్
వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంపై ప్లేట్ ఫిరాయించిన బంగ్లా సర్కార్
ఈ పద్ధతి నిజంగా వర్కువట్ అవుతుందా..? మీ అనుభవాలు తెలియజేయండి..
ఈ పద్ధతి నిజంగా వర్కువట్ అవుతుందా..? మీ అనుభవాలు తెలియజేయండి..
మహాపాపం.. మర్చిపోయి కూడా శివుడికి ఈ 5 వస్తువులు సమర్పించొద్దు..
మహాపాపం.. మర్చిపోయి కూడా శివుడికి ఈ 5 వస్తువులు సమర్పించొద్దు..
అసలు ప్రామిస్ డే అంటే ఏంటి? వాలెంటైన్స్ వీక్‌లో దీని స్పెషల్ ఇదే
అసలు ప్రామిస్ డే అంటే ఏంటి? వాలెంటైన్స్ వీక్‌లో దీని స్పెషల్ ఇదే
భారతీయులకు బిగ్ షాక్.. H-1B వీసాలు రద్దు..?
భారతీయులకు బిగ్ షాక్.. H-1B వీసాలు రద్దు..?
చల్లగా ఉన్న అన్నంను వేడి చేస్తే పాత్రకు అంటుకుంటుందా? ఇలా చేయండి.
చల్లగా ఉన్న అన్నంను వేడి చేస్తే పాత్రకు అంటుకుంటుందా? ఇలా చేయండి.
హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు దర్జాగా వస్తాడు.. రాత్రయితే చాలు..
హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు దర్జాగా వస్తాడు.. రాత్రయితే చాలు..
తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంత ఉందో తెలుసా..?
తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంత ఉందో తెలుసా..?
ఎగ్ వైట్ మాత్రమే తింటున్నారా?.. ఇది తెలిస్తే పచ్చసొన పక్కనపెట్టరు
ఎగ్ వైట్ మాత్రమే తింటున్నారా?.. ఇది తెలిస్తే పచ్చసొన పక్కనపెట్టరు
బీసీసీఐ సంచలన నిర్ణయం..షమీ, సర్ఫరాజ్ ఖాన్‌లకు మొండిచేయి
బీసీసీఐ సంచలన నిర్ణయం..షమీ, సర్ఫరాజ్ ఖాన్‌లకు మొండిచేయి