Kanna Lakshminarayana: చెప్పినట్లుగానే చేసిన కన్నా.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి..

అందరూ ఊహించినట్లుగానే చెప్పినంత పని చేశారు సీనియర్ పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ. గురువారం మధ్యాహ్నం 2.48 గంటలకు తెలుగు దేశం..

Kanna Lakshminarayana: చెప్పినట్లుగానే చేసిన కన్నా.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి..
Kanna Lakshminarayana
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 23, 2023 | 4:26 PM

అందరూ ఊహించినట్లుగానే చెప్పినంత పని చేశారు సీనియర్ పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ. గురువారం మధ్యాహ్నం 2.48 గంటలకు తెలుగు దేశం పార్టీలో చేరతానని ఆయన చెప్పినట్లుగానే చేసి చూపించారు కన్నా. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వేలాది మంది అనుచరులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. గుంటూరులోని తన నివాసం నుంచి తాడేపల్లిలోని టీడీపీ కార్యలయానికి భారీ ర్యాలీతో సహా చేరిన కన్నా లక్ష్మీనారాయణ గురువారం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కన్నాతో పాటు ఆయన కుమారుడు నాగరాజు కూడా టీడీపీలో చేరారు.

అయితే గత 9 ఏళ్లుగా బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ .. కొన్ని రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సోము వీర్రాజు తీరు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. మోదీ మీద నమ్మకం ఉందంటూనే రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా సోము వీర్రాజు, జీవీఎల్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు కన్నా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..