Harman Preet Kaur: అభిమానులతో టీమిండియా కెప్టెన్ భావోద్వేగ సందేశం.. ఎప్పటికీ వెన్నంటే ఉంటామన్న నెటిజన్లు..
హర్మన్ అర్ధ సెంచరీ కూడా చేసింది. కానీ కీలక సమయంలో భారత కెప్టెన్ రనౌట్ కావడం జట్టును దెబ్బ తీసింది. ఓటమి బాధతో మైదానంలోనే కన్నీళ్ల పర్యంతమైన..
ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్రికెట్ అభిమానులకు భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది. బలమైన ఆస్ట్రేలియన్ల చేతిలో ఐదు పరుగుల తేడాతో భారత జట్టు పరాజయాన్ని చవిచూసింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఒక దశలో విజయం వైపు నడించింది. హర్మన్ అర్ధ సెంచరీ కూడా చేసింది. కానీ కీలక సమయంలో భారత కెప్టెన్ రనౌట్ కావడం జట్టును దెబ్బ తీసింది. ఓటమి బాధతో మైదానంలోనే కన్నీళ్ల పర్యంతమైన హర్మన్ తాజాగా అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది.
This is for all our fans across the globe who have supported us throughout this World Cup . I thank you for believing in our journey. I know as a cricket fan it’s sad to see your team loose . All I can say is that we will come back strongly and put a great show out there .????
ఇవి కూడా చదవండి— Harmanpreet Kaur (@ImHarmanpreet) February 24, 2023
ఈ మేరకు తాను చేసిన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. టోర్నీలో తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ జట్టు ఓడిపోవడం బాధగా ఉందని, హృదయ విదారక ఓటమి తర్వాత భారత జట్టు బలంగా పుంజుకుంటుదని, మైదానంలో గొప్ప ప్రదర్శన కనబరుస్తుందని వ్యాఖ్యానించింది. ‘ఈ ప్రపంచకప్‌లో మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మా ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. మీ జట్టు ఓటమిని చూడటం ఎంత బాధగా ఉంటుందో క్రికెట్ అభిమానిగా నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది ఒక్కటే. మేంబ లంగా తిరిగి వస్తాం. గొప్ప ప్రదర్శన చేస్తాం’ అని కౌర్ తన ట్విట్టర్‌లో పేర్కొంది.
కాగా, దీనిపై సానుకూలంగా స్పందించిన నెటిజన్లు ఆమెకు మద్ధుతుగా నిలిచారు. ఈ క్రమంలో ఇటలీ ఫుట్‌బాల్ ప్లేయర్ అగతా ఇసాబెల్లా సెంటాస్సో ‘మీరు చేయగలరని నేను ఖచ్చితంగా ఉన్నాను. ఇటలీకి చెందిన నేను మీ కొత్త అభిమానిని’ అంటూ రాసుకొచ్చింది. ఇంకా ‘మీరు చాలా బాగా ఆడారు. ఏదేం జరిగినా ఎప్పటికీ టీమిండియా వెన్నంటే ఉంటామ’ని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘మీరు అద్భుతంగా ఆడారు. అందులో ఎటువంటి సందేహం లేద’ని మరో నెటిజన్ అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..