Tim Southee: అరుదైన ఘనత సాధించిన టిమ్ సౌథీ.. కివీస్ తరఫున మొట్టమొదటి బౌలర్‌గా సరికొత్త రికార్డు..
ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మ్యాన్ బెన్ డకెట్(9)ను అవుట్ చేయడం ద్వారా తన కెరీర్‌లో 700వ వికెట్‌ను పడగొట్టాడు టిమ్ సౌథీ. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు..
న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాక అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ ఈ ఘనతను సాధించాడు. ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మ్యాన్ బెన్ డకెట్(9)ను అవుట్ చేయడం ద్వారా తన కెరీర్‌లో 700వ వికెట్‌ను పడగొట్టాడు టిమ్ సౌథీ. అంతేకాక న్యూజిలాండ్ తరఫున 7 వందల అంతర్జాతీయ వికెట్లను పడగొట్టిన మొదటి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు సౌథీ. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ‘బ్లాక్ కాప్స్’ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. అయితే న్యూజిలాండ్ తరఫున టిమ్ సౌథీ ఇప్పటి వరకు మొత్తం 353 మ్యాచ్‌లు ఆడాడు. ఇక టెస్టుల్లో 356, వన్డేల్లో 210, టీ20లలో 134 వికెట్లు కూల్చాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు 267 పరుగల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
#StatChat | Tim Southee joins Daniel Vettori (705) as the only New Zealanders to take 700 International wickets. Southee has represented the BLACKCAPS in 353 matches across the three formats ? #NZvENGpic.twitter.com/sF3joTF1UN
అయితే రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ జట్టు 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. రూట్, బ్రూక్ సెంచరీలతో చెలరేగగా.. బజ్‌బాల్ విధానంతో మరోసారి దూకుడు ప్రదర్శించి పటిష్ట స్థితిలో నిలిచింది. కివీస్ బౌలర్లలో సౌథీ ఒకటి, మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీశారు. జో రూట్ 101 పరుగులు, హ్యారీ బ్రూక్ 184 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, రెండో రోజు కూడా ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల చేసిన క్రమంలో డిక్లేర్ ఇచ్చింది. దీంతో క్రీజులోకి వచ్చిన కివీస్ బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోలేకపోతున్నారు. మరోవైపు వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేయడమైంది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి కివీస్ జట్టు 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఇక ఇంగ్లాండ్ తరఫున జేమ్స్ ఆండర్సన్, జాక్ లీచ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా స్టువర్ట్ బ్రాడ్ 1 వికెట్ తీసుకున్నాడు.