- Telugu News Photo Gallery Cricket photos Srilanka Cricket Board Announced 17 Probables Team For New Zealand Test Series, Here is the detail
WTC Final: కివీస్‌తో సిరీస్‌కు లంకేయులు సిద్దం.. అదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో టీమిండియాతో ఢీ.!
మార్చి 9వ తేదీ నుంచి శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం 17 ప్రాబబుల్స్‌తో కూడిన..
Updated on: Feb 25, 2023 | 10:41 AM

మార్చి 9వ తేదీ నుంచి శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం 17 ప్రాబబుల్స్‌తో కూడిన జట్టును ప్రకటించింది శ్రీలంక క్రికెట్ బోర్డు.

దిముత్ కరుణరత్నే నాయకత్వంలో.. కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డి సిల్వ, దినేశ్ చండిమాల్, లాహిరు కుమార, చమిక కరుణరత్నె, కసున్ రజిత లాంటివారితో కూడిన బలమైన జట్టు.. కివీస్‌ను ఢీకొట్టేందుకు సిద్దమైంది.

న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ సిరీస్‌ను లంకేయులు వైట్‌వాష్ చేస్తే.. సరాసరి లంక జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియాతో తలబడతుంది.

అదేంటని అనుకుంటున్నారా.? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని మిగిలిన రెండు టెస్టులను భారత్ గెలిచి.. లంకేయులు న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా వెర్సస్ శ్రీలంక అవుతుంది.

లంక జట్టు: దిముత్ కరుణరత్నె(కెప్టెన్), ఒషాడా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనుంజయ డి సిల్వ, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, నిరోషన్ డిక్‌వెల్లా, నిషాన్ మదుష్క, రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, చమిక కరుణరత్నె, కసున్ రజిత, లాహిరు కుమార, అషిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, మిలన్ రత్ననాయకె.




