- Telugu News Photo Gallery Cricket photos Women's T20 World Cup 2023 Ayabonga Khaka over changed match fate of England Women vs South Africa Women semifinal
ENGW vs SAW: 6 బంతులు.. 3 వికెట్లు, మూడే పరుగులు.. ఆ ఒక్క ఓవర్‌తో వరల్డ్‌కప్ నుంచి ఇంగ్లాండ్‌ను ‘ఔట్’ చేసిన దక్షిణాఫ్రికా..
ఒకే ఒక్క ఓవర్.. ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2వ సెమీఫైనల్‌లో అప్పటివరకు దూకుడు మీదున్న ఇంగ్లాండ్ మహిళల జట్టుకు అడ్డుకట్ట వేసింది. దక్షిణాఫ్రికా బౌలర్ అయాబొంగా ఖాకా వేసిన ఈ ఓవర్‌లో ఆమె ఏకంగా 3 వికెట్లను పడగొట్టడమే కాక కేవలం మూడు పరుగులే ఇచ్చింది. దీంతో ఇంగ్లీష్ ఉమెన్స్ మీద ఒత్తిడి పెరిగి అది కాస్త దక్షిణాఫ్రికా విజయానికి కారణంగా మారింది.
Updated on: Feb 25, 2023 | 8:39 AM

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆపై 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మహిళల జట్టు తన ఇన్నింగ్స్ ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 6 పరుగుల తేడాతో గెలవడమే కాక ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు మొదటి సారిగా వెళ్లింది.

అయితే ఇంగ్లాండ్ తన బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్ వరకు కూడా దూకుడుగా ఆడింది. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్ అయాబొంగా ఖాకా వేసిన ఒక్క ఓవర్ మ్యాచ్ పరిస్థితిని పూర్తిగా తారుమారు చేసింది.

చివరి మూడు ఓవర్లలో ఇంగ్లండ్ విజయానికి 28 పరుగులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ సన్ లూస్ 18వ ఓవర్ వేయడానికి ఫాస్ట్ బౌలర్ అయాబొంగా ఖాకాకు బంతిని అప్పగించింది. ఖాకా తనపై కెప్టెన్ ఉంచిన భరోసాకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేయడమే కాక ఆ ఓవర్‌తో మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా వైపు తిప్పింది.

అదేలా అంటే 18వ ఓవర్ తొలి బంతికే అమీ జోన్స్‌ను ఖాకా అవుట్ చేసింది. ఆ తర్వాతి బంతికి ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. మూడో బంతికి ముందు ఒక వైడ్.. అలాగే ఆ బంతికి పరుగు రాలేదు.

నాలుగో బంతికి ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఐదో బంతికి సోఫీ ఎక్లెస్టన్ చెడ్డ షాట్ ఆడాడంతో బంతిని క్యాచ్ చేట్టేశారు దక్షిణాఫ్రికా మహిళలు. అదే సమయంలో క్యాట్ సివర్ బ్రంట్ కూడా చివరి బంతికి ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది.

అయితే అయాబొంగా ఖాకా వేసిన 17వ ఓవర్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టు స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 137/4. కానీ ఈ ఓవర్ తర్వాత, స్కోరు 140/7. ఇక చివరి రెండు ఓవర్లలో ఇంగ్లాండ్ 25 పరుగులు చేయాల్సి వచ్చింది. ఖాకా వేసిన ఓవర్ ఇంగ్లాండ్‌పై ఒత్తిడిని పెంచడంతో.. చివరి రెండు ఓవర్లలో పట్టు బిగించింది దక్షిణాఫ్రికా. దీంతో ఆరు పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకోగలిగింది ఆ జట్టు.




