Andhra Pradesh: ఏపీ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు శుభవార్త.. 5 ఏళ్ల వయోపరిమితి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల వయోపరిమితి సడలించిన తరహాలోనే.. ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు..

Andhra Pradesh: ఏపీ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు శుభవార్త.. 5 ఏళ్ల వయోపరిమితి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం..
Ap Cm Jagan
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 25, 2023 | 7:46 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్య్లూఎస్ వర్గాలకు చెందిన ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల వయోపరిమితి సడలించిన తరహాలోనే.. ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కూడా వయోపరిమితి సడలించింది జగన్ ప్రభుత్వం. ఈ మేరకు సబార్డినేట్స్‌ సర్వీస్‌ రూల్స్‌ను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంటే ఇకపై డైరెక్ట్ రిక్యూట్‌మెంట్‌ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 39 ఏళ్ల అన్నమాట.

అయితే ఇంతకముందు ఈడబ్య్లూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈడబ్య్లూఎస్ వర్గాలలో హర్షం వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..