AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ఆ విషయాలతో పోల్చుతూ.. నన్నో విఫలమైన కెప్టెన్‌గా చిత్రీకరించారు.. కోహ్లీ షాకింగ్స్ కామెంట్స్..

Virat Kohli Captaincy: ఐసీసీ ట్రోఫీని గెలవకపోవడం వల్లే నన్ను విఫలమైన కెప్టెన్‌గా పరిగణించారని విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

Virat Kohli: ఆ విషయాలతో పోల్చుతూ.. నన్నో విఫలమైన కెప్టెన్‌గా చిత్రీకరించారు.. కోహ్లీ షాకింగ్స్ కామెంట్స్..
Virat Kohli
Venkata Chari
|

Updated on: Feb 25, 2023 | 2:43 PM

Share

Virat Kohli Captaincy: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగమయ్యాడు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. రెండు మ్యాచ్‌లలో విరాట్ బ్యాట్ నిశ్శబ్దంగా కనిపించింది. మరోవైపు విరాట్ కోహ్లి పాడ్‌కాస్ట్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసింది. ఈ పోడ్‌కాస్ట్‌లో కింగ్ కోహ్లీ పలు విషయాలు వెల్లడించారు. ఇందులో తన కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడాడు. నన్ను విఫలమైన కెప్టెన్‌గా పరిగణించారని షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

నన్ను విఫలమైన కెప్టెన్‌గా భావించారు..

ఆర్‌సీబీ పోడ్‌కాస్ట్ సీజన్-2లో కెప్టెన్సీపై కోహ్లీ మాట్లాడుతూ.. “టోర్నమెంట్ గెలవడానికి ఆడతాం. నేను 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్‌గా ఉన్నాను. 2019 ప్రపంచ కప్‌లో కెప్టెన్‌గా ఉన్నాను. 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కెప్టెన్‌గా ఉన్నాను. 2021 టీ20 ప్రపంచ కప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాను. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్నాం. 2019 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకున్నాం. అయితే, ఐసీసీ ట్రోఫీ గెలవనందుకు విఫలమైన కెప్టెన్‌గా పరిగణించారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

“నేను ఎప్పుడూ ఆ దృక్కోణం నుంచి నన్ను అంచనా వేసుకోలేదు. మేం జట్టుగా సాధించినది నాకు ఎల్లప్పుడూ గర్వకారణంగా ఉంటుంది. టోర్నమెంట్ అనేది ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినది. కానీ, సంస్కృతి అనేది ఎక్కువ కాలం ఉంటుంది. దాని కోసం టోర్నమెంట్‌లను గెలవడం పెద్ద విషయం కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఓ ఆటగాడిగా ప్రపంచకప్ గెలిచాను అని కోహ్లీ పేర్కొన్నాడు. ప్లేయర్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాను. ఐదు టెస్టు మ్యాచ్‌లు గెలిచిన జట్టులో నేను సభ్యుడిగా ఉన్నాను. ఆ కోణంలో చూస్తే.. ప్రపంచకప్ గెలవని వారు కూడా ఉన్నారు. నిజం చెప్పాలంటే, 2011లో నాకు 2011 జట్టులో భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం. నేను మంచి స్కోర్‌ని సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

విరాట్ మాట్లాడుతూ, “సచిన్ టెండూల్కర్ తన ఆరో ప్రపంచకప్‌ను ఆడాడు. అందులోనే భారత్ ప్రపంచ కప్ గెలిచింది. నేను మొదటిసారి జట్టులో భాగమయ్యాను. విజేత జట్టులో భాగమయ్యాను” అంటూ ప్రకటించాడు.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..