Cute Video: తండ్రి కష్టంలో భాగం పంచుకున్న ‘ఆదర్శపుత్రుడు’.. వైరల్ అవుతున్న చిన్నారి చెఫ్ వీడియో..

వీడియోను చూసినట్లయితే ఆ చిన్నారి.. తోలు తీసిన బంగాళదుంపలను మెదుపుతూ పిండి పిండి చేస్తున్నాడు. ఇక ఈ దృశ్యాలను..

Cute Video: తండ్రి కష్టంలో భాగం పంచుకున్న ‘ఆదర్శపుత్రుడు’.. వైరల్ అవుతున్న చిన్నారి చెఫ్ వీడియో..
Little Baby Heling His Father To Smash Potatoes
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 25, 2023 | 1:24 PM

ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. సోషల్ మీడియాలోని నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న ఈ క్యూట్ వీడియోను మీరు చూస్తే ‘వావ్ సో క్యూట్’ అని అనకుండా ఉండలేరు. చిన్న పిల్లలు ఎప్పుడూ కూడా తమ తల్లిదండ్రులు చేసే పనులను అనుకరిస్తూ నేర్చుకుంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రస్తుత కాలంలో భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడం.. ఇంటి పనులలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం శరామాములే. ఆ క్రమంలో వీడియోలోని వ్యక్తి తన భార్యకు వంటలో సహాయం చేయాలనుకున్నాడో.. లేక తన భార్య అప్పగించిన పనిని చేస్తున్నాడో తెలియదు కానీ చూస్తే నవ్వేసుకోవాల్సిందే. అసలు ఆ వీడియోలో ఏముందో ఓ లుక్కెద్దాం..

endukandi అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఉడికిన బంగాళదుంపలపై తోలు తీస్తుంటాడు. అయితే కెమెరా ఫోకస్ ఆ వ్యక్తి పక్కనే ఉన్న అతని బేబీ బాయ్ మీదకు వెళ్తుంది. అప్పుడు కనుక మనం వీడియోను చూసినట్లయితే ఆ చిన్నారి.. తోలు తీసిన బంగాళదుంపలను మెదుపుతూ పిండి పిండి చేస్తున్నాడు. ఇక ఈ దృశ్యాలను  వైరల్ అవుతున్న ఆ వీడియోలో మనం కంటికి కట్టినట్లుగా చూడవచ్చు. తన తండ్రికి సాయం చేసేందుకు ఎంతో బాధ్యతగా బంగాళదుంపలను పిండి చేస్తున్న ఆ చిన్నారిని చూసిన నెటిజన్లు ‘ఆ క్యూట్ చెఫ్ మాకు కావాలి’ అని, ‘ఆదర్శపుత్రుడు’ అని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడండి.. 

View this post on Instagram

A post shared by Endukandi (@endukandi)

కాగా, ఈ వీడియో పోస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 7 లక్షల 8 వేల లైకులను పొందింది. అంతేకాక 90 లక్షలకు పైగా వీక్షణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు కామెంట్లు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక నెటిజన్ ‘ఇలాంటి క్యూట్ చెఫ్‌ను మొదటి సారి చూస్తున్నా’ అని కామెంట్ చేయగా, ‘ఉన్న వనరులను ఉపయోగించుకోవడం అంటే ఇదే’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే