Viral News: మీ తీరని కోరికలు నెరవేరాలంటే.. ఈ దేవుడికి చాక్లెట్ నైవేధ్యంగా పెట్టండి..
పరీక్షల సమయంలో పిల్లలు కూడా తమ ఇష్టదైవమైన బాల మురుగన్‌ని దర్శించుకుని చాక్లెట్ నైవేధ్యం సమర్పించుకుంటారు. ఇది కాకుండా, ఈ ఆలయంలో కుల, మతాలకు అతీతంగా భక్తులందరికీ మంచ్ చాక్లెట్‌ను ప్రసాదంగా అందజేస్తారు.
మన దేశంలో అడుగడునా ఒక దేవాలయం కనిపిస్తుంది. మొత్తం మూడు కోట్ల మంది దేవుళ్లను పూజిస్తారు. ఆయా దేవతలందరికీ రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. గణపతికి పత్రి, కృష్ణుడికి వెన్న, శివుడికి బిల్వపత్రం ఇస్తారన్నది ప్రజల విశ్వాసం. పిల్లలను శాంతింపజేయడానికి చాక్లెట్ ఇవ్వడం సాధారణం, కానీ, ఇక్కడ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడికి చాక్లెట్స్‌ని నైవేధ్యంగా సమర్పింస్తుంటారు. ఈ వింత ఆచారం కేరళలోని కేరళ రాష్ట్రంలోని ‘తెక్కన్ పలని’ బాలసుబ్రమణ్య(కుమారస్వామి) ఆలయంలో భక్తులు చాకోలేట్లను నైవేధ్యంగా సమర్పించుకుంటారు.
అవును, గత ఆరు సంవత్సరాలుగా ఈ ప్రదేశం మంచ్ మురుగన్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఒక చిన్న పిల్లవాడు బాలమురుగన్‌కు మంచ్ చాక్లెట్ అందించిన తర్వాత, భగవంతుడు అతన్ని మెచ్చుకున్నాడని ఇక్కడి భక్తుల నమ్మకం.
ఆలయ నిర్వహణ చేస్తున్న అనుప్ ఎ.చెమ్మోత్ మాట్లాడుతూ.. గతంలో ఈ ఆలయంలో దేవుళ్లందరికీ పండ్లు, పూలు తదితర పూజలు చేసేవారని, అయితే 6 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన తర్వాత ఇప్పుడు భక్తులంతా మంచ్ చాక్లెట్‌ను అందజేస్తున్నారని తెలిపారు.
బాల మురుగన్ ‘మంచ్ మురుగన్’గా ఎలా మారాడు? 6 సంవత్సరాల క్రితం ఆడుకుంటున్న ఒక చిన్న ముస్లిం బాలుడు ఈ ఆలయానికి వచ్చి గంట కొట్టాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని మందలించారు. అదే రోజు రాత్రి బాలుడి ఆరోగ్యంలో మార్పు వచ్చింది. తల్లిదండ్రులు మరుసటి రోజు ఉదయం ఆలయానికి వచ్చి, రాత్రంతా బాలుడు మురుగన్ నామం జపిస్తున్నాడని పూజారికి చెప్పారు. పూజారి దేవుడికి ఏదైనా నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు నువ్వుల నూనె ఇవ్వడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. అక్కడే ఉన్న కుర్రాడు తన దగ్గర ఉన్న మంచ్ చాక్లెట్ ని దేవుడికి నైవేద్యంగా పెట్టాడు. ఇక ఆ తర్వాత అద్భుతం జరిగింది. ఈ సంఘటన తర్వాత అతను కోలుకున్నాడు. ఈ ఘటనతో పట్టణంలో సంబరాలు అంబరాన్నంటాయి. దీంతో భక్తులు మంచ్ చాక్లెట్‌ను అందించడం ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత బాల మురుగన్ ‘మంచ్ మురుగన్’గా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మంచ్ చాక్లెట్లను కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తున్నారు. పరీక్షల సమయంలో పిల్లలు కూడా తమ ఇష్టదైవమైన బాల మురుగన్‌ని దర్శించుకుని చాక్లెట్ నైవేధ్యం సమర్పించుకుంటారు. ఇది కాకుండా, ఈ ఆలయంలో కుల, మతాలకు అతీతంగా భక్తులందరికీ మంచ్ చాక్లెట్‌ను ప్రసాదంగా అందజేస్తారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ..