స్కూల్‌ విద్యార్థులకు ఎగ్జామ్‌ కిట్స్ అందజేసిన ఎమ్మెల్యే.. జనాల్లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌..!

ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ చేస్తున్న వినూత్న కార్యక్రమాలు కూడా జనంలో చర్చగా మారుతున్నాయి..

స్కూల్‌ విద్యార్థులకు ఎగ్జామ్‌ కిట్స్ అందజేసిన ఎమ్మెల్యే.. జనాల్లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌..!
Chief Whip Vinay Bhaskar
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 25, 2023 | 12:39 PM

గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ తరహాలో పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ వినూత్న కానుక అందజేస్తున్నారు.ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ అందజేసి వారిని ప్రోత్సాహిస్తున్నారు. వరంగల్‌లో ఆయన చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అసలే ఎన్నికల సమీపిస్తున్న వేళ.. నేతలంతా ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు.. ఏ పని చేసినా అంతిమంగా ఓటర్లను ఆకట్టుకోవడమే కర్తవ్యం… ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ చేస్తున్న వినూత్న కార్యక్రమాలు కూడా జనంలో చర్చగా మారుతున్నాయి.. అపార్ట్ మెంట్ దర్శన్, స్ట్రీట్ వెండర్స్ తో మీట్, ప్రజలతో ముఖాముఖి, MLA మీట్ విత్ మార్నింగ్ వాకర్స్, చెక్కు మొక్క లాంటి కార్యక్రమాలతో జనం లో హాట్‌ టాపిక్‌గా మారిన ఆయన ఇప్పుడు మరో కొత్త కార్యక్రమంతో రాజకీయ పార్టీలు, ప్రజల్లో మరింత చర్చకు దారితీస్తున్నారు.

గర్భిణీ స్త్రీలకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ అందిస్తున్న తరహాలోనే.. పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్ అందిస్తున్నారు.. అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఆయనే స్వయంగా వెళ్లి దాతలు సంతోష్ సహకారంతో పరీక్ష కిట్స్ అందజేస్తున్నారు.. ఆ కిట్ లో పరీక్ష ప్యాడ్ తో పాటు, పరీక్షలకు అవసరం అయ్యే వస్తువులను సమకూర్చారు..

వారికి ఎగ్జామ్ కిట్స్ అంద జేయడమే కాదు.. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ పేద విద్యార్థులలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
గోరుచిక్కుడులోని గొప్ప గుణాలు తెలిస్తే షాక్‌ తినడం ఖాయం..!
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
ఇదేంది సామీ ఇలా.. 6 చెత్త రికార్డులతో మొదటిసారి ఇలా..
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!