Telangana: కీలక నిర్ణయం దిశగా తెలంగాణ సర్కార్.. భగ్గుమంటున్న రైతాంగం..!

వ్యవసాయాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టింది. రైతుబంధు సహా వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సదుపాయాన్ని..

Telangana: కీలక నిర్ణయం దిశగా తెలంగాణ సర్కార్.. భగ్గుమంటున్న రైతాంగం..!
Farmers
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 25, 2023 | 3:50 PM

వ్యవసాయాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలు ప్రవేశపెట్టింది. రైతుబంధు సహా వ్యవసాయానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సదుపాయాన్ని అందించింది. అయితే, రైతులకు ఉచిత విద్యుత్ అందించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సంస్కరణల వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా బోర్లకు ఆటోమేటిక్‌ స్టార్టర్ల వినియోగానికి కత్తెర వేయాలని నిర్ణయించారు. ఇదే ఇప్పుడు రైతులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. గతంలో మాదిరి కరెంట్ సరఫరా కావడం లేదని, ఇష్టమొచ్చినట్టు కోతలు విధిస్తున్నారని ఆందోళనకు దిగుతున్నారు.

జల వనరులు పెరగడం, నాన్‌స్టాప్‌ ఫ్రీ కరెంట్‌తో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది. ఓవరాల్‌గా విద్యుత్‌ వాడకం కూడా పెరిగిపోయింది. సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కరెంట్‌ కోతలు తప్పడం లేదు. దీంతో రైతుల్లో అవగాహన కల్పించి, ఆటోమేటిక్‌ స్టార్టర్లను తొలగించాలని ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీనిపై రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.

ఆయా జిల్లాల్లో రైతులు పోరుబాట పడుతున్నారు. నిరంత విద్యుత్ కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ విద్యుత్ స్టేషన్లను ముట్టడిస్తున్నారు. అయితే, ఆటోమాటిక్ స్టార్టర్ల వినియోగం వల్ల కరెంట్ వృధా ఎక్కువ అవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అవసరం మేరకు వినియోగించేలా ఆటోమాటిక్ స్టార్టర్స్‌ని తొలగించాలని చూస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..