Telangana: మరో మెడికో సూసైడ్.. హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య..
తెలంగాణలో మరో మెడికో సూసైడ్ ఘటన కలకలం రేపుతోంది. వరంగల్ ఘటన తర్వాత నిజామాబాద్ జిల్లాలో మరో మెడికో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ప్రభుత్వమెడికల్ కాలేజీలో
తెలంగాణలో మరో మెడికో సూసైడ్ ఘటన కలకలం రేపుతోంది. వరంగల్ ఘటన తర్వాత నిజామాబాద్ జిల్లాలో మరో మెడికో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ ప్రభుత్వమెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న విద్యార్థి దాసరి హర్ష.. శనివారం తన హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష (21) నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో.. శనివారం ఉదయం తన స్నేహితులు వసతి గృహానికి వెళ్లి చూడగా అప్పటికే హర్ష ఉరేసుకొని కనిపించాడు.. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీసులు తెలిపారు.
కాగా, వైద్య విద్యార్థి హర్ష ఆత్మహత్యపై కళాశాల ప్రిన్సిపల్ స్పందించారు. హర్ష మృతిపై ఎలాంటి అనుమానాలు లేవన్నారు. హర్ష తెలివైన విద్యార్థి.. అని అన్ని పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేవన్నారు. హర్షకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తెలుస్తోందని.. పేర్కొన్నారు.
అయితే, హర్ష సూసూడ్‌కి కారణాలేంటి అనేది ఇంకా తెలియరాలేదు. అయితే ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..