AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: జాలరి పేటలో అరుదైన శ్వేత నాగు కలకలం.. భయాందోళనలో జనాలు.. ఎందుకంటే..

పామును చూసిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నారు. ఇది అన్ని పాముల్లోకెల్ల అరుదైన జాతిగా ఈ సర్పాన్ని గుర్తించినట్లు స్నేక్‌ క్యాచర్‌ కిరణ్ చెప్పారు.

Andhra Pradesh: జాలరి పేటలో అరుదైన శ్వేత నాగు కలకలం.. భయాందోళనలో జనాలు.. ఎందుకంటే..
Rare White Swethanaagu
Jyothi Gadda
|

Updated on: Feb 25, 2023 | 12:39 PM

Share

మామూలు త్రాచు పాము, విశాఖలో కనిపించిన శ్వేత నాగును స్క్రీన్‌పై చూస్తున్నాం. రెండింటి మధ్య రంగులో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖలో కనిపించిన ఈ అరుదైన పామునే శ్వేతనాగుగా చెబుతున్నారు. దాని బుస, పడగ, విషం అన్నీ మామూలు పాముకంటే భిన్నంగా ఉంటాయి. కరిస్తే క్షణాల్లోనే ప్రాణం పోవడం ఖాయం. ఎక్కడో, ఎప్పుడోగానీ కనిపించని ఈ అరుదైన సర్పం తాజాగా విశాఖ జాలరిపేటలో కనిపించింది. వలలో చిక్కి విలవిల్లాడుతున్న శ్వేతనాగును స్నేక్ క్యాచర్స్ చాకచక్యంగా కాపాడి సురక్షిత ప్రాంతంలో వదిలారు.

విశాఖపట్నం జాలరి పేట కోటవీధి ప్రాంతంలో అరుదైన శ్వేతనాగు కనిపించి కలకలం సృష్టించింది. కోట వీధి సమీపంలో మేరీ మాత ఆలయం కొండ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి చేరిన శ్వేతనాగు జనాల్లో కల్లోలం సృష్టించింది. పామును చూసిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నారు.  చిన్నపాటి గాయాలు కావడంతో పాముకి ప్రథమ చికిత్స అందించారు. ఇది అరుదైన జాతిగా ఈ సర్పాన్ని గుర్తించినట్లు స్నేక్‌ క్యాచర్‌ కిరణ్ చెప్పారు.

అనంతరం ఈ అరుదైన శ్వేతనాగును జూలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు కు అప్పగిస్తామని తెలిపారు. లేదంటే, దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అడవిలో విడిచి పెట్టడం జరుగుతుందని కిరణ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..