AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Warriors: బెంగాల్ టైగర్స్‌పై సత్తాచాటిన అఖిల్, అశ్విన్.. వరుసగా రెండో విజయంతో తెలుగు వారియర్స్..

తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో.. తెలుగు వారియర్స్ విజయానికి 114 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో..

Telugu Warriors: బెంగాల్ టైగర్స్‌పై సత్తాచాటిన అఖిల్, అశ్విన్.. వరుసగా రెండో విజయంతో తెలుగు వారియర్స్..
Ccl Telugu Warriors
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 26, 2023 | 8:26 AM

సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) 2023లో తెలుగు వారియర్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో కేరళపై గెలిచిన టాలీవుడ్ జట్టు.. రెండో మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్‌ను మట్టికరిపించింది. కెప్టెన్ అక్కినేని అఖిల్ మరోసారి సత్తా చాటడంతో బెంగాల్‌పై అలవోక విజయాన్ని అందుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 10 ఓవర్లలో 114 పరుగులు చేసింది. అయితే ఆ జట్టు 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ.. జిష్షు సేన్‌గుప్తా రాణించడంతో బెంగాల్ భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం గ్రౌండ్‌లోకి దిగిన తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. దీంతో బెంగాల్‌పై 12 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కేరళతో జరిగిన మ్యాచ్‌లో 91 (30), 65* (19) పరుగులు చేసిన అఖిల్.. టోర్నీలో వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. బెంగాల్ టైగర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అఖిల్ కేవలం 26 బంతుల్లో 57 రన్స్ చేశాడు. మరోవైపు అశ్విన్ బాబు కూడా 17 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జిష్షు సేన్ గుప్తా 83 రన్స్ చేయడంతో.. బెంగాల్ టైగర్స్ పది ఓవర్లలో 126 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో.. తెలుగు వారియర్స్ విజయానికి 114 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 62 పరుగులతో సత్తా చాటడంతో టాలీవుడ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ విజయంతో సీసీఎల్ 2023 పాయింట్ల పట్టికలో తెలుగు వారియర్స్ అగ్రస్థానానికి చేరుకుంది. గత ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌పై తెలుగు వారియర్స్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 2011లో ప్రారంభమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్..  2019 వరకు ప్రతి ఏటా సజావుగా సాగింది. అయితే కరోనా ప్రభావంతో మూడేళ్లపాటు ఈ టోర్నీ నిర్వహణ సాధ్యం కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న సీసీఎల్ 2023 సీజన్లో 8 జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్లో ఫైనల్ మ్యాచ్ మార్చి 19న హైదరాబాద్‌లో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..