RGUKT: ఆర్జీయూకేటీలో చదివి పాస్‌కాని విద్యార్ధులకు మరో సదావకాశం.. వారంతా అర్హులే..

ఆర్జీయూకేటీలో చదివి పలు కారణాలతో ఉత్తీర్ణత పొందని విద్యార్థులకు అధికారులు మరో అవకాశం కల్పించారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద పరీక్షలు రాసేందుకు అనుమతిస్తూ ప్రకటన విడుదల..

RGUKT: ఆర్జీయూకేటీలో చదివి పాస్‌కాని విద్యార్ధులకు మరో సదావకాశం.. వారంతా అర్హులే..
RGUKT
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 26, 2023 | 9:20 PM

ఆర్జీయూకేటీలో చదివి పలు కారణాలతో ఉత్తీర్ణత పొందని విద్యార్థులకు అధికారులు మరో అవకాశం కల్పించారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద పరీక్షలు రాసేందుకు అనుమతిస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆర్జీయూకేటీల్లో చదివి ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారికి పట్టా తీసుకోవడానికి సదావకాశం కల్పించినట్లైంది. సాధారణంగా విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులు ఆరేళ్ల కోర్సు చదివి డిగ్రీ పట్టా తీసుకొని బయటకు వస్తారు. ఉత్తీర్ణులు కాలేని వారు తర్వాత రెండేళ్లలో ఉత్తీర్ణత సాధించి పట్టా తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. అప్పటికీ పాస్‌ కానివారికి ఇక ఎప్పటికీ అవకాశం ఉండదన్నమాట.

అలాంటి విద్యార్థులందరికీ మరో అవకాశం కల్పించి పరీక్షలు నిర్వహించాలని గతంలో చాలాసార్లు విజ్ఞప్తులు చేశారు. నిబంధనల ప్రకారం అందుకు ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలోనే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఉపకులపతి వెంకటరమణ ప్రతిపాదన చేశారు. అలాంటి విద్యార్థులకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వాలనే వీసీ ప్రతిపాదనను సమావేశంలో సభ్యులందరూ ఆమోదించారు. తాజా నిర్ణయంతో దాదాపు179 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.