AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK T20 WC Live Score: భారత్ ఘన విజయం.. గ్రాండ్‌గా సూపర్ 8లోకి సూర్యసేన

India vs Pakistan, T20 world Cup 2026 Live Score Updates: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఈ విజయంతో, భారత జట్టు సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు విజయాలతో ఆ జట్టు గ్రూప్ A పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

IND vs PAK T20 WC Live Score: భారత్ ఘన విజయం.. గ్రాండ్‌గా సూపర్ 8లోకి సూర్యసేన
Ind Vs Pak T20i Wc Live Updates
Venkata Chari
|

Updated on: Feb 15, 2026 | 10:22 PM

Share

India vs Pakistan, T20 world Cup 2026 Live Score Updates: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఈ విజయంతో, భారత జట్టు సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు విజయాలతో ఆ జట్టు గ్రూప్ A పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేశాడు. సైమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్(కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 15 Feb 2026 10:21 PM (IST)

    భారత్ ఘన విజయం..

    టీ20 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో ఓడించింది. టోర్నమెంట్ చరిత్రలో పరుగుల పరంగా పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం ఇది. ఈ విజయంతో, భారత జట్టు సూపర్ 8 రౌండ్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడు విజయాలతో ఆ జట్టు గ్రూప్ A పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

  • 15 Feb 2026 10:09 PM (IST)

    9 వికెట్లు కోల్పోయిన పాక్

    15.3 ఓవర్లు ముగిసేసరికి జట్టు పాకిస్తాన్ స్కోరు 97/9. షాహీన్ షా అఫ్రిది క్రీజులో ఉన్నాడు.

  • 15 Feb 2026 09:46 PM (IST)

    6వ వికెట్ డౌన్

    టీ20 ప్రపంచ కప్‌లో భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ జట్టులో సగం మందిని కోల్పోయింది. 11.4 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 78/6తో ఉంది. షాదాబ్ ఖాన్ క్రీజులో ఉన్నాడు.

  • 15 Feb 2026 09:41 PM (IST)

    10 ఓవర్లకు

    10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 71/4. ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్ క్రీజులో ఉన్నారు. 9వ ఓవర్ తొలి బంతికి లాంగ్ ఆన్‌లో ఉస్మాన్ ఖాన్ క్యాచ్‌ను తిలక్ వర్మ వదిలేశాడు.

  • 15 Feb 2026 09:31 PM (IST)

    8 ఓవర్లకు

    8 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 47/4 గా నిలిచింది. ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్ క్రీజులో ఉన్నారు.

  • 15 Feb 2026 09:19 PM (IST)

    4 వికెట్లు కోల్పోయిన పాక్

    5 ఓవర్లు ముగిసే సరికి పాక్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది.

  • 15 Feb 2026 09:05 PM (IST)

    2 ఓవర్లకు పాక్ స్కోర్..

    2 ఓవర్లు ముగిసే పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. హార్దిక్ 1, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. దీంతో పాక్ 2 ఓవర్లు ముగిసే సరికి 13 పరుగులు చేసింది.

  • 15 Feb 2026 08:53 PM (IST)

    ఈ మ్యాచ్‌లో నమోదైన పలు రికార్డులు..

    2026లో కొలంబో (RPS)లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, భారత జట్టు టీ20 ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక డకౌట్‌ (3)లుగా తమ రికార్డును సమం చేసింది. టోర్నమెంట్‌లో ముందుగా వాంఖడేలో USAతో జరిగిన మ్యాచ్‌లోనూ భారత జట్టు తరపున 3 డకౌట్లు నమోదయ్యాయి.

    T20 WCలలో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు వేసిన అత్యధిక ఓవర్లు:

    18 ఓవర్లు – పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా, కొలంబో (RPS), 2012

    18 ఓవర్లు – పాకిస్తాన్ vs ఇండియా, కొలంబో (RPS), 2026, ఈ రాత్రి*

    16 ఓవర్లు – ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, ఢిల్లీ, 2016

    16 ఓవర్లు – ఆఫ్ఘనిస్తాన్ vs వెస్టిండీస్, నాగ్‌పూర్, 2016

    16 ఓవర్లు – పాకిస్తాన్ vs USA, కొలంబో (SSC), 2026

    టీ20 WCలలో కొలంబోలో అత్యధిక ఇన్నింగ్స్ మొత్తం (RPS):

    205/4 – వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా, 2012

    196/5 – ఇంగ్లాండ్ vs ఆఫ్ఘనిస్తాన్, 2012

    191/8 – వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా, 2012

    182/6 – ఆస్ట్రేలియా vs ఐర్లాండ్, 2026

    175/7 – ఇండియా vs పాకిస్తాన్, 2026, నేటి మ్యాచ్

    T20Is (పూర్తి సభ్య దేశాలు)లో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లు వేసిన అత్యధిక ఓవర్లు:

    18 – జింబాబ్వే vs వెస్టిండీస్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 2010

    18 – పాకిస్తాన్ vs ఆస్ట్రేలియా, కొలంబో (RPS), 2012

    18 – పాకిస్తాన్ vs ఇండియా, కొలంబో (RPS), 2026, నేటి మ్యాచ్

    టీ20 WCలలో పాకిస్తాన్ పై భారత్ చేసిన అత్యధిక ఇన్నింగ్స్ మొత్తం:

    175/7, కొలంబో(RPS), 2026, నేటి మ్యాచ్

    160/6, మెల్బోర్న్, 2022

    157/5, జోహన్నెస్‌బర్గ్, 2007

    151/7, దుబాయ్ (DICS), 2021

    టీ20I లలో పాకిస్తాన్ పై భారత్ చేసిన అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు:

    192/5, అహ్మదాబాద్, 2012

    181/7, దుబాయ్ (DICS), 2022

    175/7, కొలంబో (RPS), 2026, నేటి మ్యాచ్

    174/4, దుబాయ్ (DICS), 2025

    160/6, మెల్బోర్న్, 2022

  • 15 Feb 2026 08:43 PM (IST)

    పాక్ టార్గెట్ 176

    టి20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌కు భారత్ 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో సహా 77 పరుగులు చేశాడు.

    ఇషాన్ తో పాటు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 25 పరుగులు చేశాడు. పాకిస్తాన్ తరపున సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, ఉస్మాన్ తారిక్, షాహీన్ షా అఫ్రిది తలా ఒక వికెట్ తీసుకున్నారు.

  • 15 Feb 2026 08:22 PM (IST)

    16 ఓవర్లకు

    16 ఓవర్లకు భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. సూర్య కుమార్ 24, దుబే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 15 Feb 2026 08:14 PM (IST)

    2 బంతుల్లో రెండు వికెట్లు..

    తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలను సయూం ఆయూబ్ రెండు వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 14. 3 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.

  • 15 Feb 2026 08:08 PM (IST)

    14 ఓవర్లకు భారత్..

    14 ఓవర్లలో భారత్ 2 వికెట్లకు 125 పరుగులు చేసింది. తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నారు.

  • 15 Feb 2026 08:03 PM (IST)

    IND vs PAK T20 World Cup Live Updates: 12 ఓవర్లకు భారత్..

    12 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. సూర్యకుమార్ 14, తిలక్ వర్మ 25 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 15 Feb 2026 07:48 PM (IST)

    10 ఓవర్లకు భారత్..

    10 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 97 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. తిలక్ వర్మ, సూర్యకుమార్ క్రీజులో నిలిచారు.

  • 15 Feb 2026 07:43 PM (IST)

    ఇషాన్ ఔట్..

    ఇషాన్ కిషన్ (77) హాఫ్ సెంచరీ తర్వాత ఆయూబ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బాల్ ను తప్పుగా అంచనా వేయడంతో పెవిలియన్ చేరాడు.

  • 15 Feb 2026 07:36 PM (IST)

    ఇషాన్ హాఫ్ సెంచరీ..

    ఎనిమిది ఓవర్లలో భారత్ 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. ఇషాన్ 27 బంతుల్లో తన హాఫ్ సెంచరీ సాధించాడు.

  • 15 Feb 2026 07:24 PM (IST)

    6 ఓవర్లకు భారత్..

    ఆరు ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 42, తిలక్ వర్మ 10 క్రీజులో ఉన్నారు.

  • 15 Feb 2026 07:17 PM (IST)

    4 ఓవర్లకు 30 పరుగులు

    నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. మూడో ఓవర్లో కిషన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. మొదటి ఓవర్ చివరి బంతికి సల్మాన్ అలీ ఆఘా వేసిన బంతికి అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు.

  • 15 Feb 2026 07:09 PM (IST)

    ⁠IND vs PAK T20 World Cup Live Score: 2 ఓవర్లకు

    2 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ కోల్పోయి 15 పరుగులు చేసింది. తిలక్ 4, ఇషాన్ 12 పరుగులతో నిలిచారు.

  • 15 Feb 2026 07:04 PM (IST)

    ⁠India vs Pakistan Match Status: అభిషేక్ ఔట్..

    అభిషేక్ శర్మ తొలి ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లోనూ జీరోకే పెవిలియన్ చేరాడు.

  • 15 Feb 2026 06:50 PM (IST)

    నో హ్యాండ్ షేక్..

    కొలంబో వేధికగా కాసేపట్లో భారత్  పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ బరితమైన మ్యాచ్ జరగనుంది. అయితే  మ్యాచ్ కు ముందూ టాస్ సందర్భంగా పిచ్ లో ఆశ్చర్యకరమైన సీన్ కనిపించింది. టాస్ తర్వాత భారత కెప్టెన్ సూర్య కుమార్ పాకిస్తాన్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వెను తిరిగాడు.

  • 15 Feb 2026 06:40 PM (IST)

    ఇరు జట్లు..

    భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

    పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్(కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.

  • 15 Feb 2026 06:36 PM (IST)

    IND vs PAK: టాస్ గెలిచిన పాకిస్తాన్..

    టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 15 Feb 2026 06:29 PM (IST)

    నమీబియాపై అమెరికా విజయం..

    నమీబియాపై అమెరికా జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో గ్రూప్ ఏ లో భారత్, పాక్, అమెరికా జట్లు తలో 4 పాయింట్లతో సమానంగా నిలిచాయి. కానీ, రన్ రేట్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. పాక్ రెండో స్థానంలో ఉండగా అమెరికా 3వ స్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్ ఏ నుంచి నమీబియా తప్పుకుంది.

  • 15 Feb 2026 06:09 PM (IST)

    గ్రూప్ ఏ పరిస్థితి..?

    గ్రూప్ ఏ లో మొత్తం ఐదు జట్లు ఉన్నాయి. భారత్, పాక్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. ఇందులో భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పాక్ జట్టు కూడా 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా జట్టు, నెదర్లాండ్స్ జట్లు తలో 2 పాయింట్లతో నిలిచాయి. నమీబియా జట్టు ఇప్పటి వరకు విజయం సాధించలేదు.

  • 15 Feb 2026 05:45 PM (IST)

    స్టేడియానికి చేరుకున్న భారత జట్టు

    కీలక మ్యాచ్ కోసం భారత జట్టు కొలంబో స్టేడియానికి చేరుకుంది.

  • 15 Feb 2026 05:20 PM (IST)

    స్టేడియం వెలుపల అభిమానుల సందడి

    కొలంబో స్టేడియంలో సందడి మొదలైంది. స్టేడియం బయట అభిమానుల బారులు తీరారు.

  • 15 Feb 2026 05:05 PM (IST)

    పాకిస్థాన్‌ను ఓడించిన భారత్..

    ఏసీసీ ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 ఆరో మ్యాచ్‌లో ఇండియా ఏ 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఏ ని ఓడించింది. ఆదివారం బ్యాంకాక్‌లోని టెర్డ్‌థాయ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏ ఇండియా ఏ కి 94 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇండియా ఏ ఈ లక్ష్యాన్ని కేవలం 10.1 ఓవర్లలోనే సులభంగా సాధించింది.

  • 15 Feb 2026 04:55 PM (IST)

    IND vs PAK: టీమిండియా ప్లేయింగ్ 11?

    అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

  • 15 Feb 2026 04:40 PM (IST)

    అర్షదీప్ ఔట్..?

    టీమిండియా ప్లేయింగ్ 11 నుంచి అర్షదీప్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్షదీప్ స్థానంలోకుల్దీప్ యాదవ్ చోటు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

  • 15 Feb 2026 04:16 PM (IST)

    కొలంబోలో మొదలైన సందడి..

    కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వెలుపల అభిమానుల సందడి మొదలైంది.

  • 15 Feb 2026 03:59 PM (IST)

    నో షేక్ హ్యాండ్స్..

    టీ20 ప్రపంచ కప్ సమయంలోనూ భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయరు. గత ఏడాది ఆసియా కప్ సందర్భంగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు.  పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

  • 15 Feb 2026 03:44 PM (IST)

    100, 200 లే కాదు.. 5 కూడా లేదు భయ్యో.. IND vs PAK పోరులో ఈ లెక్కలు మిస్సయితే మజానే ఉండదంతే..

    టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు కొలంబోలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత్, పాక్ పోరులో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ ను క్లిక్ చేయండి..

  • 15 Feb 2026 03:40 PM (IST)

    IND vs PAK: అభిషేక్ శర్మ ఆడేనా..?

    టీమిండియా ఆల్ రౌండర్ అభిషేక్ శర్మ ఇప్పుడు పూర్తిగా ఫిట్ గా ఉన్నాడు. నేటి మ్యాచ్ లో ఆడతాడని భావిస్తున్నారు. శనివారం జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు. మ్యాచ్ కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో, జట్టు కెప్టెన్ కూడా అభిషేక్ ఎంపికకు అందుబాటులో ఉన్నాడని సూచించాడు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ మునుపటి మ్యాచ్ కు దూరమయ్యాడు. 2 రోజులు ఆసుపత్రిలో చేరాడు.

  • 15 Feb 2026 03:24 PM (IST)

    IND vs PAK: వరుసగా 10 మ్యాచ్‌ల్లో ఓడిపోలే..

    టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లను గెలిచిన రికార్డును టీమిండియా కలిగి ఉంది. 2024లో భారత జట్టు ఎనిమిది మ్యాచ్‌లను గెలిచింది. ఇప్పుడు 2026లో రెండు మ్యాచ్‌లను గెలవడం ద్వారా భారత జట్టు కొత్త రికార్డును సృష్టించింది.

  • 15 Feb 2026 03:12 PM (IST)

    IND vs PAK Weather Report: కొలంబోలో తాజా వాతావరణ పరిస్థితులు..

    కొలంబోలో వాతావరణం మారుతోంది. వర్షాభావ పరిస్థితులు మారుతున్నాయి. బీబీసీ వెదర్ ప్రకారం, కొలంబోలో సాయంత్రం 6:30 గంటలకు వర్షం పడే అవకాశం 40 శాతం ఉంది. సాయంత్రం 7:30 గంటలకు వర్షం పడే అవకాశం 32 శాతంగా ఉంది. రాత్రి 8:30 గంటలకు వర్షం పడే అవకాశం 20 శాతానికి తగ్గింది.

  • 15 Feb 2026 02:54 PM (IST)

    IND vs PAK: పాక్ ఆటగాళ్లను కలిసిన నఖ్వీ..

    భారత్‌తో మ్యాచ్ అంటే పాక్ ఆటగాళ్లు ఒత్తిడిలో కూరుకపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్ల ఒత్తిడి తగ్గించేందుకు, వారిని ప్రోత్సహించడానికి పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ రావాల్సి వచ్చింది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు మొహ్సిన్ నఖ్వీ పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేస్తూ కనిపించాడు.

  • 15 Feb 2026 02:53 PM (IST)

    India vs Pakistan Live Score: 13వ గెలుపు కోసం భారత్..?

    భారత్, పాకిస్థాన్ జట్లు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 16 సార్లు తలపడ్డాయి. భారత్ 12 సార్లు గెలిచింది. రెండు జట్ల మధ్య ఇది ​​17వ మ్యాచ్ అవుతుంది. భారత్ 13వ విజయాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది.

  • 15 Feb 2026 02:25 PM (IST)

    India vs Pakistan Live Score: ఇండియా – పాకిస్తాన్ రికార్డులు..

    టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఇది ​​తొమ్మిదవ మ్యాచ్ అవుతుంది. గతంలో జరిగిన ఎనిమిది మ్యాచ్‌లలో, భారత జట్టు 7 మ్యాచ్‌లలో గెలిచింది. పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలిచింది. అంటే, భారత జట్టు పాకిస్తాన్‌పై 7-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.

  • 15 Feb 2026 02:07 PM (IST)

    India vs Pakistan Live Score: ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

    వర్షం అంతరాయం కలిగించకపోతే, భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ సాయంత్రం 6:30 గంటలకు జరుగుతుంది.

Published On - Feb 15,2026 2:05 PM

Follow Us