పెళ్లైన హీరోతో ఎఫైర్.. దెబ్బకు కెరీర్ నాశనం.. ఇండస్ట్రీలో బ్యాన్.

Rajitha Chanti

Pic credit - Instagram

15 February 2026

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో కొందరు చిన్న చిన్న పొరపాట్లతో తమ కెరీర్ నాశనం చేసుకున్నారు.

అందులో నికిత తుక్రాల్ ఒకరు. ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించి అందం, అభినయంతో కట్టిపడేసింది.

అప్పట్లో ఆమెకు మంచి క్రేజ్ ఉండేది. తెలుగులో డాన్, జానకి రాముడు వంటి చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

నిజానికి పంజాబీ కుటుంబంలో జన్మించిన నికితా.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఎక్కువగా సౌత్ సినిమాలతో పాపులర్ అయ్యింది.

అప్పట్లో ఆమె కుర్రాళ్ల ఆరాధ్య దేవత. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో రూమర్స్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి.

కన్నడకు చెందిన ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగింది. కానీ అప్పటికే అతడికి వివాహం జరిగిందని.. అయినా ప్రేమించిందని టాక్.

తన భర్తతో చనువుగా ఉండొద్దు అని ఆ హీరో భార్య సైతం సెట్స్ కు వచ్చి ఈ ముద్దుగుమ్మను బెదిరించిన విషయం అప్పట్లో ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్.

పెళ్లైన హీరోతో ఎఫైర్ కారణంగా నికితాకు అవకాశాలు తగ్గాయి. అలాగే పలు వివాదాలలో ఆమె పేరు రావడంతో ఆమెను కన్నడలో బ్యాన్ చేశారు.