Ritika Singh: ‘సోషల్ మీడియాలో వాటిని చూసి గుండె పగిలిపోయింది’.. హీరోయిన్ రితిక సింగ్ ఆవేదన..

ఆ తర్వాత నీవెవరో, శివలింగ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కార్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న రితిక సోషల్ మిడీయా ట్రోలింగ్స్ పై స్పందించింది. అవి తనను చాలా బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేసింది.

Ritika Singh: 'సోషల్ మీడియాలో వాటిని చూసి గుండె పగిలిపోయింది'.. హీరోయిన్ రితిక సింగ్ ఆవేదన..
Ritika
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 26, 2023 | 9:30 AM

సోషల్ మీడియాలో సెలబ్రెటీలపై వచ్చే ట్రోలింగ్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇటీవల పలువురు స్టార్ హీరోయిన్స్ పై దారుణంగా ట్రోల్స్ చేయడం తెలిసిందే. కొందరు నటీమణులు తమపై వస్తున్న నెగిటివిటిపై గట్టిగానే రియాక్ట్ అవుతుంటారు. మరికొందరు మాత్రం చూసి చూడనట్టుగా వదిలేస్తుంటారు. అయితే నెట్టింట తమపై వచ్చే ట్రోలింగ్స్ మానసికంగా ఎంతగానో ఇబ్బందిపెడుతుంటాయని అన్నారు హీరోయిన్ రితిక సింగ్. తనకు కూడా నెట్టింట ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు తెలిపారు. 2017లో వెంకటేష్ సరసన గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దగుమ్మ. ఆ తర్వాత నీవెవరో, శివలింగ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కార్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న రితిక సోషల్ మిడీయా ట్రోలింగ్స్ పై స్పందించింది. అవి తనను చాలా బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేసింది.

రితిక సింగ్ మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రోల్స్ ఎంతగానో బాధించాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఇవి నన్ను చాలా ఇబ్బందికి గురిచేసాయి. దీనితో నా గుండె పగిలిపోయింది. అంతేకాకుండా నాకు ఓ ఫ్యామిలీ ఉంటుంది. నాకు పేరెంట్స్, బ్రదర్ ఉన్నారు. వాళ్లు కూడా ఇవి చూస్తే వారి హృదయం కూడా బద్దలవుతుంది. ఆడవారికి అందరూ గౌరవం ఇవ్వాలి. ఒక సెలబ్రెటీ అయినా.. మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా ఒకే రకమైన గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మిడిల్ క్లాస్ అయినంత మాత్రాన మనం వారిని తక్కువగా చూడకూడదు” అంటూ చెప్పుకొచ్చింది రితిక.

ఇవి కూడా చదవండి

అలాగే అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్సివ్ ఉండాలని.. ఇందుకోసం కాలేజీల్లో, స్కూల్లో వారానికి కనీసం ఒక్కసారైనా సెల్ఫ్ డిఫెన్సివ్ సంబంధించిన క్లాసులు జరగాలి అన్నారు. ఈ విషయంలో తన తరపున ఎలాంటి సాయం చేసేందుకు అయిన ముందుంటానని అన్నారు. ప్రస్తుతం రితిక నటిస్తున్న కార్ చిత్రం మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్