AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: హాలీవుడ్ సినిమాలు చేయాలని ఉందంటున్న రామ్ చరణ్..  మనసులోని కోరిక అదే..

ఈ కార్యక్రమంలో సినిమా విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. అలాగే తనకు హాలీవుడ్ సినిమాలు చేయాలని ఉందంటూ మనసులోని కోరికను బయటపెట్టారు.

Ram Charan: హాలీవుడ్ సినిమాలు చేయాలని ఉందంటున్న రామ్ చరణ్..  మనసులోని కోరిక అదే..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2023 | 4:52 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించే స్థాయిలో ఉన్నారు. గత మూడు రోజులుగా అమెరికా పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో పేరు అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే చెర్రీకి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రముఖ ఛానల్ అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీలో ప్రసారమ్యే గుడ్ మార్నింగ్ అమెరికా షోకు అతిథిగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో సినిమా విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. అలాగే తనకు హాలీవుడ్ సినిమాలు చేయాలని ఉందంటూ మనసులోని కోరికను బయటపెట్టారు.

ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ సక్సెస్ అని అనిపిస్తుందా అని అడగ్గా.. చరణ్ స్పందిస్తూ.. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం తాము ఎంతో కష్టపడ్డామని అన్నారు. అలాగే నాటు నాటు పాటను ఉక్రెయిన్ లోని అందమైన లొకేషన్లలో తీశామని.. షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఒక టూరిస్ట్ గా మళ్లీ ఉక్రెయిన్ కు వెళ్లాలని అనుకున్నానని తెలిపారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వస్తే ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడతానని చెప్పారు. ఆస్కార్ అవార్డుల స్థాయికి భారతీయ సినిమాలు వస్తుండటం సంతోషకరమని అన్నారు. సినిమాకు బాష ఉండదని.. కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయని అన్నారు…

సినిమా నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. డ్యాన్స్ చేయిస్తుంది.. భయపెడుతుంది కూడా. ఇలా అన్ని చేయిస్తుందని రాజమౌళి చెప్పేవారు. కోవిడ్ సమయంలో భారతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా చూశారని అన్నారు. కేవలం భారతీయ సినిమాలే కాకుండా.. హాలీవుడ్ చిత్రాలు కూడా చేయాలనుకుంటున్నానని తన మనసులోని కోరికను బయటపెట్టారు. అలాగే నాటు నాటు పాటను ఉక్రెయిన్ అద్యక్షుడి ఇంటి ముందు 15 రోజులపాటు చిత్రీకరించామని.. ఏడు రోజులు రిహార్సిల్స్ చేశామన్నారు. ఆస్కార్ అవార్డుకు ఈ సాంగ్ నామినేట్ కావడం ఎంతో ఆనందంగా ఉందని.. ఇది భారతదేశ సినీ పరిశ్రమ సాధించిన విజయమని అన్నారు చరణ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే