AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamta Mohandas: ‘రాజమౌళి ఆ మాట అనగానే నా గుండె పగిలిపోయింది’.. యమదొంగ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్..

కొద్దిరోజులుగా విటిలిగో అనే చర్మ సంబంధిత సమస్య తనను వెంటాడుతుంది. ఇటీవలే తాను ఈ సమస్యతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

Mamta Mohandas: 'రాజమౌళి ఆ మాట అనగానే నా గుండె పగిలిపోయింది'.. యమదొంగ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్..
Mamta Mohandas, Rajamouli
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2023 | 3:37 PM

Share

తెలుగు తెరపై అలరించిన కేరళ ముద్దుగుమ్మలలో మమతా మోహన్ దాస్ ఒకరు. పలు చిత్రాల్లో నటించిన మెప్పించిన ఈ అమ్మడుకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే నటిగా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అనుకోకుండా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. తన జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని ఆత్మస్థైర్యంతో పోరాడుతూ వస్తోంది. ఇప్పటికే రెండుసార్లు క్యాన్సర్ బారిన పడిన ఆమె.. ధైర్యంగా దానిని జయించారు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టిన మమతా మోహన్ దాస్.. ఇప్పుడు మరో సమస్యతో పోరాడుతున్నారు. కొద్దిరోజులుగా విటిలిగో అనే చర్మ సంబంధిత సమస్య తనను వెంటాడుతుంది. ఇటీవలే తాను ఈ సమస్యతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

ఓవైపు క్యాన్సర్.. ధైర్యంగా జయించిన కొద్ది రోజులకే మరో అనారోగ్య సమస్యతో నిత్యం జీవితం కోసం పోరాడుతుంది. అలాగే తనవరకు వచ్చిన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మమతా మోహన్ దాస్.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. తాను అరుంధతి సినిమా వదులుకుని చాలా పెద్ద తప్పు చేశానంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమా కంటే ముందు నాకు అరుంధతి సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అప్పటికీ నాకు తెలుగు సినీ పరిశ్రమపై పెద్దగా అవగాహన లేదు. ఆ సమయంలో మా మేనేజర్ ఆ నిర్మాణ సంస్థ పెద్దది కాదు.. మాములుదని.. అంతగా మంచి పేరు లేదని చెప్పడంతో వెంటనే రిజెక్ట్ చేశాను. నేను నటించనని చెప్పిన తర్వాత నిర్మాత శ్యాంప్రసాద్ నన్ను చాలాసార్లు ఒప్పించాలని ప్రయత్నించారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత నాకు యమదొంగ ఆఫర్ వచ్చింది. ఆ సినిమా అడిషన్స్ కోసం వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని రాజమౌళితో చెప్పాను.

అరుంధతి సినిమా అవకాశాన్ని వదిలిశాను అని చెప్పడంతో.. గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నావు అని రాజమౌళి అన్నారు. ఆయన మాటలు వినగానే నా గుండె పగిలిపోయింది. అప్పటికి ఇంకా అరుంధతి సినిమా విడుదల కాలేదు ” అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు మమతా మోహన్ దాస్. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తెలుగులో మమతా మోహన్ దాస్.. కింగ్, కేడీ, కృష్ణార్జున వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా